Telugu Global
Cinema & Entertainment

చిరు ఐటెంసాంగ్ అప్ డేట్స్...

సెట్స్ పైకి వెళ్లకముందు నుంచే చిరంజీవి ఐటెంసాంగ్ మార్కెట్లో అదరగొట్టేస్తోంది. ఈసారి తమ అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి స్టెప్స్ చించేస్తాడా అని ప్రేక్షక లోకం అంతా ఎదురుచూస్తోంది. ఇందుకు తగ్గట్టే ఖైదీ నంబర్-150లో  ఐటెంసాంగ్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాడు చిరంజీవి. తాజాగా ఈ సినిమాలో ఐటెంసాంగ్ షూటింగ్ కు సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చాయి. కేవలం ఐటెంసాంగ్ షూటింగ్ కోసమే రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారట. […]

చిరు ఐటెంసాంగ్ అప్ డేట్స్...
X

సెట్స్ పైకి వెళ్లకముందు నుంచే చిరంజీవి ఐటెంసాంగ్ మార్కెట్లో అదరగొట్టేస్తోంది. ఈసారి తమ అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి స్టెప్స్ చించేస్తాడా అని ప్రేక్షక లోకం అంతా ఎదురుచూస్తోంది. ఇందుకు తగ్గట్టే ఖైదీ నంబర్-150లో ఐటెంసాంగ్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాడు చిరంజీవి. తాజాగా ఈ సినిమాలో ఐటెంసాంగ్ షూటింగ్ కు సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చాయి. కేవలం ఐటెంసాంగ్ షూటింగ్ కోసమే రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారట. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి నేతృత్వంలో… దాదాపు కోటిన్నర రూపాయల ఖర్చుతో ఈ సెట్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. సెట్ పని దాదాపు 70శాతం పూర్తయిపోయింది. ఈ నెలాఖరుకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. అక్టోబర్ మొదటి వారంలో ఐటెంసాంగ్ ను ఈ సెట్ లో పిక్చరైజ్ చేయాలని నిర్ణయించారు. ఐటెంసాంగ్ కు సంబంధించి క్యాథరీన్ థ్రెసా ఇప్పటికే హోం వర్క్ చేస్తోంది. చిరు సరసన స్టెప్పులేయాలంటే ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిందే. అందుకే ఐటెంసాంగ్స్ కోసం వేసే స్టెప్పుల్ని ముందుగానే ప్రాక్టీస్ చేస్తోంది. చిరు 150వ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే ఐటెంసాంగ్ ను సిద్ధం చేశాడని తెలుస్తోంది.

First Published:  6 Sep 2016 10:48 PM GMT
Next Story