Telugu Global
Cinema & Entertainment

నిన్నొద‌ల  బొమ్మాళి అంటున్న నాని...

నా దారి ర‌హ‌దారి అంటాడు   న‌ర‌సింహా చిత్రంలో  ర‌జ‌నీకాంత్.  అలాగే నాని కూడా  నా దారి   భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అంటున్న‌ట్లుంది.   ఇండ‌స్ట్రీలో  ఎవ‌రేమి చేసినా ఫైనాల్ గా  స‌క్సెస్ మాత్ర‌మే  మాట్లాడుతుంది. ఫెయిల్యూర్ అంటే అంద‌రికి అయిష్ట‌మే,.  ఒక స‌క్సెస్ తో   ఎంతో మంది ఐడింటిఫై అవుతారు.  క‌ట్ చేస్తే  ఇక నానీ లాంటి  హీరోకు ప్ర‌తి చిత్రం   మిన‌మ‌మ్  క‌మ‌ర్షియ‌ల్ గా  పాజిటివ్  గా బిజినెస్ చేయాల్సిందే. […]

నిన్నొద‌ల  బొమ్మాళి అంటున్న నాని...
X
నా దారి ర‌హ‌దారి అంటాడు న‌ర‌సింహా చిత్రంలో ర‌జ‌నీకాంత్. అలాగే నాని కూడా నా దారి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అంటున్న‌ట్లుంది. ఇండ‌స్ట్రీలో ఎవ‌రేమి చేసినా ఫైనాల్ గా స‌క్సెస్ మాత్ర‌మే మాట్లాడుతుంది. ఫెయిల్యూర్ అంటే అంద‌రికి అయిష్ట‌మే,. ఒక స‌క్సెస్ తో ఎంతో మంది ఐడింటిఫై అవుతారు. క‌ట్ చేస్తే ఇక నానీ లాంటి హీరోకు ప్ర‌తి చిత్రం మిన‌మ‌మ్ క‌మ‌ర్షియ‌ల్ గా పాజిటివ్ గా బిజినెస్ చేయాల్సిందే. లేక పోతే క‌ష్ట‌మే.
ఫ్యాన్స్ ద‌ళాలు కొందరికే వున్నారు. ముఖ్యంగా క‌మ‌ర్షియ‌ల్ స్టార్స్ అంద‌రికి అభిమాన సంఘాలున్నాయి. అవి లేని హీరోలంద‌రు ప్ర‌తి చిత్రంతో త‌మ ఉనికి చాటుకోవాల్సిందే. ఆ కోవ లో నాని భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నాడు.
క‌థ‌ల ఎంపికలో కాస్త వైవిధ్యంగా ఉండే నానీ.. ప్ర‌స్తుతం ఏ చిత్రం చేసినా వినోదం లేకుండా మాత్రం చేయ‌డం లేదు. ఎంట‌ర్ టైన్ మెంట్ వుంటే సినిమా స‌క్సెస్ రేంజ్ ఏ స్థాయిలో వుంటుందో ఆయ‌న‌కు భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో అనుభివంలోకి వ‌చ్చింది. దీంతో ఆ ఫార్మేట్ ను మాత్రం వ‌ద‌ల‌డం లేద‌నిపిస్తుంది తాజాగా విడుద‌లైన మ‌జ్ను చిత్రం ట్రైల‌ర్ చూస్తుంటే. ట్రైల‌ర్ యూత్ ఆడియ‌న్స్ ను టార్గెట్ చేసిన‌ట్లు స్ప‌ష్టం అవుతుంది.
First Published:  7 Sep 2016 3:31 AM GMT
Next Story