Telugu Global
Cinema & Entertainment

న‌రేష్ ఇంట్లో దెయ్యం..

ఈ మ‌ధ్య సెల్పీ రాజా చిత్రంతో  ఒక విజ‌యాన్ని  త‌న ఖాతాలో వేసుకున్న  అల్ల‌రి న‌రేష్..తాజాగా   ఇంట్లో దెయ్యం పేరు తో  ఒక చిత్రం చేస్తున్నారు.  గ‌తంలో  న‌రేష్ కు సీమ‌శాస్త్రి వంటి  సూప‌ర్ హిట్ ను ఇచ్చిన ద‌ర్శ‌కుడు  జి నాగేశ్వ‌రెడ్డి  ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. బివి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.  సీమ‌శాస్త్రి,  సీమ‌ట‌పాకాయ్ చిత్రాల మాదిరే  .. వినోదం, ఫ్యామిలి ఎలిమెంట్స్  తో  ఈసినిమాను చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు తెలిపారు. […]

న‌రేష్ ఇంట్లో దెయ్యం..
X
ఈ మ‌ధ్య సెల్పీ రాజా చిత్రంతో ఒక విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న అల్ల‌రి న‌రేష్..తాజాగా ఇంట్లో దెయ్యం పేరు తో ఒక చిత్రం చేస్తున్నారు. గ‌తంలో న‌రేష్ కు సీమ‌శాస్త్రి వంటి సూప‌ర్ హిట్ ను ఇచ్చిన ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. బివి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్ చిత్రాల మాదిరే .. వినోదం, ఫ్యామిలి ఎలిమెంట్స్ తో ఈసినిమాను చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు తెలిపారు. ఒక భ‌య ప‌డుతూ.. మ‌రో ప‌క్క నవ్విస్తూ వుంటుంద‌ట‌. రెండు పాట‌లు మిన‌హా సినిమా షూటింగ్ పూర్తి అయిన‌ట్లు తెలుస్తుంది. ద‌స‌రా పండ‌గ స‌మ‌యంలో ఈసినిమా అభిమానుల్ని అలరించ‌డానికి సిద్దం అవుతున్న‌ట్లు నిర్మాత టాక్. బ్ర‌హ్మ‌నందం, రాజేంద్ర ప్ర‌సాద్, పోసాని , జ‌బ‌ర్ధ‌స్త్ చందు, శంక‌ర్ ..ల‌తో పాటు మ‌రికొంద‌రు కమెడియ‌న్స్ ఈ చిత్రం లో న‌టిస్తున్నారు. మొత్తం మీద న‌రేష్ ఈ సారి సూప‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది మ‌రి.
First Published:  7 Sep 2016 3:43 AM GMT
Next Story