Telugu Global
Cinema & Entertainment

రామ్ సినిమా క్లయిమాక్స్ కు వచ్చింది....

ఒక సినిమా స్టార్ట్ చేశాడంటే… దాన్ని కంప్లీట్ చేసేవరకు నిద్రపోడు రామ్. మరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోడు. మరీ ముఖ్యంగా ఇప్పటికే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన ప్రాజెక్టు కాబట్టి తప్పకుండా పూర్తిచేసి తీరాల్సిందే. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ స్టార్ అదే పనిలో ఉన్నాడు. రామ్ నటిస్తున్న హైపర్ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం జార్జియాలోని అందమైన లొకేషన్లలో ఈ సినిమాకు సంబంధించి రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నాడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ […]

రామ్ సినిమా క్లయిమాక్స్ కు వచ్చింది....
X

ఒక సినిమా స్టార్ట్ చేశాడంటే… దాన్ని కంప్లీట్ చేసేవరకు నిద్రపోడు రామ్. మరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోడు. మరీ ముఖ్యంగా ఇప్పటికే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన ప్రాజెక్టు కాబట్టి తప్పకుండా పూర్తిచేసి తీరాల్సిందే. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ స్టార్ అదే పనిలో ఉన్నాడు. రామ్ నటిస్తున్న హైపర్ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం జార్జియాలోని అందమైన లొకేషన్లలో ఈ సినిమాకు సంబంధించి రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నాడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. జార్జియా నుంచి తిరిగి వచ్చిన వెంటనే.. హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సినిమాను దసరా కానుకగా ఈనెల 30న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ గ్యాప్ లో ఆడియో ను కూడా గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 14 రీల్స్ ఎఁటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. నేను శైలజ సక్సెస్ తో ఫుల్ ఖుషీగా ఉన్న రామ్… హైపర్ తో ఆ ఆనందాన్ని అలానే కొనసాగించాలనుకుంటున్నాడు.

First Published:  8 Sep 2016 9:38 PM GMT
Next Story