టీజీ వెంకటేష్‌ రాజ్యసభ సీటుపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు

కాకినాడ సభలో పలు విషయాలపై పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తాను ఏంచేస్తానన్నదానిపై మాత్రం పవన్ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడున్న నేతలంతా విఫలమై చేతులెత్తేస్తే అప్పుడు తమ పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. ప్రసంగంలో టీడీపీ ఎంపీలు టీజీ వెంకటేష్, అవంతి శ్రీనివాస్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ వెంకటేష్ రాజ్యసభ సీటుపై పవన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీజీ వెంకటేష్ తనను కుంభకర్ణుడు అన్నారని… కానీ తాను కూడా చాలా మాట్లాడగలనన్నారు. కర్నూలు జిల్లాలో టీజీ పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం వస్తోందో తనకు తెలుసన్నారు. కానీ సుస్వాగతం సినిమా సమయంలో టీజీ వెంకటేష్ ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నానని ఆ విషయం తనకు ఇంకా గుర్తుందన్నారు. టీజీ వెంకటేష్ ఈరోజు కూర్చున్న రాజ్యసభ సీటు జనసేన కార్యకర్తల్లో ఒకరు కాదనుకుంటే వచ్చిందన్నారు. జనసేన కార్యకర్త వద్దనుకుంటేనే ఆ సీటు టీజీ వెంకటేష్ తీసుకున్నారన్నారు. జనసేన కార్యకర్త వదిలేసిన సీటులో కూర్చుని తిరిగి మమ్మల్నే అంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు కాబట్టి తెలియదేమో ఒక సారి వెళ్లి అడగండి … టీడీపీకి మేం ఏం సాయం చేశామో అని టీజీను ఉద్దేశించి అన్నారు. తాను చేసింది ఉడత సాయమే అయినా సాయం సాయమేనన్నారు.

టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ … పవన్ ఎంపీగా గెలిచి పోరాడాలని కావాలంటే రాజీనామా చేసి తన సీటును ఖాళీ చేస్తాననడంపైనా జనసేన అధ్యక్షుడు స్పందించారు. ఎంపీ కావాలనుకుంటే పీఆర్పీలోనే అయ్యే వాడిని కదా అని ప్రశ్నించారు. నిజంగా అవంతికి సీమాంధ్రపై ప్రేమ ఉంటే హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేయాలని పవన్ సూచించారు. అప్పుడు తిరిగి తాను దగ్గరుండి అవంతి శ్రీనివాస్‌ను గెలిపించుకుంటానన్నారు. ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లే ముందు కాస్త ఒంటికి కారం పూసుకుని వెళ్లాలని సూచించారు.

Click on Image to Read:

pawan

pawan-kakinada

gottipati-ravi-kumar-lokesh

ap-assembly

venkaiah-naidu

jairam-ramesh

chevireddy-bhasar-reddy

kodela shiva rama krishna 1

mla-anitha

pvnarasimharao-kotla-vijaya-bhaskar-reddy

ktr

chandrababu-shasanamandali

purandeswari-ys-jagan

avanthi-srinivas-haribabu

koratala-siva-vs-boyapati-srinu

ys-jagan-chit-chat

vishnukumar-raj

gorantla-buchaiah-chowdary