Telugu Global
Cinema & Entertainment

మ‌ళ్లీ మెగా  హీరోతో చాన్స్  కొట్టిన  పూజ  హెగ్డే..! 

తెలుగులో   వ‌రుణ్ తేజ డెబ్యూ   చిత్రం  ముకుందతో  టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన  క‌న్న‌డ  అమ్మాయి పూజా హెగ్డే ఆ త‌రువాత  ఒక లైలా కోసం చిత్రం తో  మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. ఈ రెండు చిత్రాల కంటే ఈ మ‌ధ్య హృతిక్ రోష‌న్ తో  మొహింజ‌దారో చిత్రం  చేసింది. ఈ సినిమా తో  బాలీవుడ్  లో  ఎస్టాబ్లీష్  అవుతుంది అనుకుంటే సీన్ సితారా అవుతుంది.   అయితే   హీరోయిన్స్ కు  ఒక్క లాంగ్వేజ్  అనే […]

మ‌ళ్లీ మెగా  హీరోతో చాన్స్  కొట్టిన  పూజ  హెగ్డే..! 
X
తెలుగులో వ‌రుణ్ తేజ డెబ్యూ చిత్రం ముకుందతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన క‌న్న‌డ అమ్మాయి పూజా హెగ్డే ఆ త‌రువాత ఒక లైలా కోసం చిత్రం తో మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. ఈ రెండు చిత్రాల కంటే ఈ మ‌ధ్య హృతిక్ రోష‌న్ తో మొహింజ‌దారో చిత్రం చేసింది. ఈ సినిమా తో బాలీవుడ్ లో ఎస్టాబ్లీష్ అవుతుంది అనుకుంటే సీన్ సితారా అవుతుంది.
అయితే హీరోయిన్స్ కు ఒక్క లాంగ్వేజ్ అనే లెక్క‌లేదు. ఇది పూజ హ‌గ్డే కు క‌లిసొస్తుంది. ప్ర‌స్తుతం దిల్ రాజ్ బ్యాన‌ర్ లో హ‌రీష్ శంక‌ర్ బ‌న్నీతో చేస్తున్న దువ్వాడ జ‌గ‌న్నాధం చిత్రంలో చాన్స్ కొట్టిసింది. అక్టోబ‌ర్ లో సినిమా రెగ్యుల‌ర్ షూట్ ను ప్రారంభించ‌బోతున్నారని టాక్. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం . మ‌రి రేసు గుర్రం , స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి , స‌రైనోడు..చిత్రాల‌తో క‌లెక్ష‌న్ల ప‌రంగా 50 కోట్లు క్ల‌బ్ లోకి ఎంట్రీ కొట్టిన బ‌న్నీ.. ఈ చిత్రంతో 100 కోట్లు క్ల‌బ్ లో ఎంట్రీ కొడ‌తారేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.
First Published:  9 Sep 2016 3:25 AM GMT
Next Story