ఇకపై ఇలాంటి సభలు ఏర్పాటు చేయను…

ప్రత్యేక హోదా కోసం ప్రతి జిల్లాలోనూ సభలు ఏర్పాటు చేస్తానని తిరుపతి సభలో చెప్పిన పవన్ మనసు మార్చుకున్నట్టుగా ఉన్నారు. కాకినాడ సభలో ఒక అభిమాని  పైనుంచి కిందపడి చనిపోవడంపై స్పందించిన పవన్… అభిమాని మృతి తనను కలచివేసిందన్నారు. ఇకపై ఇలాంటి సభలు ఏర్పాటు చేయనని చెప్పారు. కాకినాడలోని కిరణ్‌ కంటి ఆస్పత్రిని సందర్శించిన అనంతరం మాట్లాడిన పవన్ కల్యాణ్… పోరాటం చేతగాకపోతే ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా ఎంపీలు రాజీనామా చేస్తే ఏ విధంగా పోరాటం చేయాలో తాను చెబుతానన్నారు. బంద్‌లు, ఆందోళనల  వల్ల రాష్ట్రం ఇప్పటికే నలిగిపోయిందన్నారు. భావోధ్వేగాలను తాను రెచ్చగొట్టేలా ప్రసంగం చేయనన్నారు. తనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి పోరాటం చేయాలన్నారు. ఒక చిన్న ఉపన్యాసంలోనే ఆందోళనలు వద్దని, ఆందోళన చేయాలని పవన్ చెప్పడం వినేవాళ్లకు గందరగోళంగా అనిపించింది.

మరోవైపు కాకినాడ సభలో పవన్ తనపై చేసిన వ్యాఖ్యలకు వెంకయ్యనాయుడు స్పందించారు. భాష, యాస, ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టవద్దని సూచించారు. హోదా అంశాన్ని భావోద్వేగంగా మార్చి తమను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తనను వ్యక్తిగతంగానూ విమర్శిస్తున్నారని అయితే వాటిని తాను పట్టించుకోనన్నారు. తాను ఏపీకి సంబంధించిన ఎంపీని కానప్పటికీ రాష్ట్రం మంచి కోసం పనిచేస్తున్నానని గుర్తు చేశారు. తనకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదన్నారు వెంకయ్య.

Click on Image to Read:

ys-jagan

pawan-meeting-kakinada

ysrcp-1

ap-assembly-media-point

ap-assembly-sessions

venkaiah-naidu

chandrababu-pawan-kakinada

pawan

pawan-kakinada

pawan-kakinada-meeting

gottipati-ravi-kumar-lokesh

venkaiah-naidu

jairam-ramesh

kodela shiva rama krishna 1

pvnarasimharao-kotla-vijaya-bhaskar-reddy

purandeswari-ys-jagan

avanthi-srinivas-haribabu

koratala-siva-vs-boyapati-srinu