Telugu Global
Cinema & Entertainment

మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విషయంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాటనిలబెట్టుకున్నాడు. ఎప్పుడో మూడేళ్ల కిందట ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని మరీ ఇప్పుడు దాన్ని నెరవేర్చుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఫైట్ మాస్టర్స్ ఇద్దరూ చెప్పుకొచ్చారు. చిరంజీవి 150వ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్న రామ్-లక్ష్మణ్… చరణ్ తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ టైమ్ లోనే… చిరంజీవితో సినిమా చేసే అవకాశం కల్పిస్తానని ఈ ఫైట్ మాస్టర్స్ కు చెర్రీ […]

మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్
X

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విషయంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాటనిలబెట్టుకున్నాడు. ఎప్పుడో మూడేళ్ల కిందట ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని మరీ ఇప్పుడు దాన్ని నెరవేర్చుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఫైట్ మాస్టర్స్ ఇద్దరూ చెప్పుకొచ్చారు. చిరంజీవి 150వ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్న రామ్-లక్ష్మణ్… చరణ్ తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ టైమ్ లోనే… చిరంజీవితో సినిమా చేసే అవకాశం కల్పిస్తానని ఈ ఫైట్ మాస్టర్స్ కు చెర్రీ మాటిచ్చాడు. ఆ తర్వాత ఎన్నో రోజులు గడిచిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు చెర్రీ గుర్తుపెట్టుకొని మరీ రామ్ లక్ష్మణ్ లను పిలిపించాడు.

చిరంజీవి 150వ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసే అవకాశాన్ని కల్పించాడు. చిరంజీవి నటించిన జేబుదొంగ సినిమాతోనే పరిశ్రమకొచ్చారు రామ్-లక్ష్మణ్. మెగాస్టార్ నటించిన ఎన్నో సినిమాల్లో ఫైటర్స్ గా కనిపించారు. ఎట్టకేలకు చిరంజీవి సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసే అవకాశం రావడంతో తమ కడుపు నిండిందంటున్నారు ఈ ఫైట్ మాస్టర్లు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోయినప్పడు చాలా బాధపడ్డామని, ఇక చిరు సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసే అవకాశం ఈ జీవితానికి ఇక రాదని తెగ బాధపడ్డామని… అయితే చిరంజీవి 150వ సినిమా స్టార్ట్ చేసినప్పుడు తమకు ఉత్సాహం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే చెర్రీ పిలిచిమరీ తమకు అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు రామ్-లక్ష్మణ్.

First Published:  9 Sep 2016 10:42 PM GMT
Next Story