మెగాస్టార్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి తీసుకున్న హీరోయిన్!

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చరిష్మా గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. ఏడు పదుల వయస్సులో కూడా స్టార్ హీరోలకు తగ్గకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటూ తన సత్తాను తన పర్ఫార్మెన్స్ ద్వారా చాటుకుంటున్నాడు ఇప్పటికీ. ఇక హీరోయిన్ల పారితోషికం కన్నా మెగాస్టార్ పారితోషికం ఒకింత ఎక్కువే ఉంటుంది. కాని అది నిన్నటి మాట. ఇప్పుడు బాలివుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే మెగాస్టార్ కన్నా ఎక్కువ డిమాండ్ చేసి సాధించుకుంది. ‘పీకు ‘ సినిమాకి ప్రొడ్యూసర్ దీపికాకే ఎక్కువ రెమ్యూనరేషన్ ముట్ట చెప్పాడని స్వయంగా మెగాస్టార్ చెప్పుకుని, ‘నా విలువ తగ్గిపొయిందా? లేదా ఆమె క్యారెక్టరే ఎక్కువగా ప్రాముఖ్యత కలిగినదా?’ అంటూ తర్కించుకున్నాడు. ఏం చేస్తాం? బాలివుడ్‌లో మహిళల క్యారెక్టర్స్ చాలా పవర్‌ఫుల్‌గా తయారు చేస్తుండడం మంచి పరిణామమే.