పవన్‌ ఫ్యాన్స్‌ను బాబు ఇలా వాడుకోబోతున్నారా?

చంద్రబాబు 2014 ఎన్నికల్లో గెలవడానికి యూత్ ఓటర్లు బాగా ఉపయోగపడ్డారు. యూత్‌లో ఎక్కువ ఓట్లు టీడీపీకే పడడానికి కొన్ని కారణాలున్నాయి. అందులో ఒకటి చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు పరిపాలించిన విధానం గురించి పదేళ్ల కాలంలో ఓటర్లుగా ఎదిగిన పిల్లలకు పెద్దగా అవగాహన లేకపోవడం అందులో ఒకటి. రెండు పవన్‌ కల్యాణ్. పవన్‌ ఫ్యాన్స్‌లో ఎక్కువ మంది యూతే కావడంతో వారంతా ఆయన చెప్పడంతో వెనుకాముందు ఆలోచించకుండా టీడీపీకి ఓటేశారు. దీంతో బాబు సీఎం అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక యువతకు ఏం చేశారన్నది పక్కన పెడితే… కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కాలంలో ఓటర్లుగా ఎదిగిన పిల్లలను పవన్ సాయంతో బుట్టలో వేసుకున్నారు చంద్రబాబు. ఎలాగో అనుకూల మీడియా … చంద్రబాబు సూపర్ డూపర్, ఆయనే లేకుంటే హైటెక్ సిటీ లేదు, కంప్యూటర్‌ అన్నదే వచ్చి ఉండేది కాదు… చంద్రబాబు అధికారంలోకి వస్తే తన అనుభవంతో లక్షల ఉద్యోగాలు ఇస్తారు అంటూ బాగా నమ్మించింది. ఈ ఫార్ములాతో 2014 ఎన్నికల్లో గెలవగలిగారు చంద్రబాబు.

మరి 2019 ఎన్నికల్లో ఎలా గెలవాలి?. పవన్ అభిమానులను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై చంద్రబాబు ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. ఎలాగో హోదా సాధించలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు యూత్ ఓట్లేసే అవకాశం చాలా తక్కువ. ఈ విషయం చంద్రబాబు సొంత సర్వేల్లోనూ తేలిపోయింది. అలా జరిగితే ఆ ఓట్లన్నీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి వెళ్తాయి. అందుకే చంద్రబాబు ముందస్తు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. పవన్‌ కల్యాణ్‌ను మరోవిధంగా 2019లో వాడుకోబోతున్నారు.

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ నేరుగా ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. అలా చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో కొంత భాగమైనా నేరుగా జగన్‌కు వెళ్లకుండా నిలువరించవచ్చు అన్నది చంద్రబాబు వ్యూహం. అయితే 175 స్థానాల్లో పవన్‌ పోటీ చేయకపోవచ్చు. ఇందుకు శనివారం రాత్రి ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. 175 స్థానాల్లో పోటీ చేస్తానన్న మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తాను మాట్లాడనని పవనే నేరుగా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే 175 స్థానాల్లో పోటీ చేసే ఆలోచన పవన్‌కు లేదు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు నేరుగా వైసీపీకి ఎక్కువగా వెళ్లే నియోజకవర్గాల్లో పవన్‌ సేన పోటీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలా చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా పరోక్షంగా టీడీపీకి పవన్ మరోసారి ప్రాణం ఇవ్వబోతున్నారు.

ఈ ఐదేళ్ల కాలంలో పెద్దమనుషులై ఓటర్లుగా మారే యువత ఓట్లు కూడా పవన్‌ వైపు మళ్లించవచ్చు అన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యూహాన్ని లోతుగా పరిశీలిస్తే పవన్‌ ఫ్యాన్స్‌కు సొంతంగా రాజకీయం గురించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే శక్తి లేని వారిగా చంద్రబాబు భావిస్తున్నట్టు అనిపిస్తుంది. పైగా  ఒక మాజీ ఎంపీ చెప్పినట్టు పవన్ వెంట ఉన్న వారిలో 14 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసు ఉన్న వారే ఎక్కువ. ఆ వయసు వారు సొంత ఆలోచనల కంటే ఇతరుల ప్రభావానికి,  ముఖ్యంగా సినిమా నటుల ప్రభావానికి లోనవుతారన్నది వాస్తవం. మొత్తం మీద మొన్నటి ఎన్నికల్లో పవన్‌ ఫ్యాన్స్‌ను నేరుగా వాడేసుకున్న చంద్రబాబు… ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు నేరుగా ప్రతిపక్షానికి మళ్లకుండా ఒక గుంపుగా ఉంచబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Click on Image to Read:

kvp-ramachandra-rao

pawan

rajashekar-reddy-ysr

pawan

pawan-interview

chandrababu-naidu-comments-on-political-carear

pawan-kalyan

chintakayala-chinna-rajappa

koratala-siva-vs-boyapati-srinu