Telugu Global
Cinema & Entertainment

తెరపైకి మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్

ప్రస్తుతం సింగం-3 సినిమా చేస్తున్న సూర్య.. త్వరలోనే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం నయనతార, తమిళనాట బిజీ హీరోయన్ గా కొనసాగుతోంది. మరో హీరోకు కాల్షీట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. అందుకే ఆమెను ఒప్పించేందుకు స్వయంగా సూర్య రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్యతో నయన్ తో సంప్రదింపులు జరుపుతున్నాడట. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఘటికుడు సినిమా వచ్చింది. […]

తెరపైకి మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్
X

ప్రస్తుతం సింగం-3 సినిమా చేస్తున్న సూర్య.. త్వరలోనే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం నయనతార, తమిళనాట బిజీ హీరోయన్ గా కొనసాగుతోంది. మరో హీరోకు కాల్షీట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. అందుకే ఆమెను ఒప్పించేందుకు స్వయంగా సూర్య రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్యతో నయన్ తో సంప్రదింపులు జరుపుతున్నాడట. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఘటికుడు సినిమా వచ్చింది. అంతకంటే ముందు గజనీ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించింది నయనతార. ఇప్పుడు మరోసారి సూర్య-నయన్ కాంబినేషన్ తెరపైకి రాబోతోందంటేనే సూర్య ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. అటు దర్శకుడు విఘ్నేష్ కు కూడా నయనతార బాగా పరిచయం. రీసెంట్ గా శివకార్తికేయన్-నయనతార హీరోహీరోయిన్లుగా నేను రౌడీనే అనే సినిమాను విఘ్నేష్ తెరకెక్కించాడు. ఆ పరిచయంతో విఘ్నేష్ కూడా నయనతార కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నాడు. సో.. దర్శకుడు-హీరో కలిసి ఒకేసారి ప్రయత్నిస్తున్నారు కాబట్టి… నయనతార ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ ఒకటి విడుదలకానుంది.

First Published:  11 Sep 2016 12:53 AM GMT
Next Story