కేవీపీ ఒక విక్రమార్కుడంటున్న బీజేపీ కేంద్ర మంత్రి

ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేస్తున్న యోధులంతా విభజన సమయంలో ఎక్కడున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ముందు అప్పట్లో వారేం చేశారో చెప్పి తనను విమర్శించాలన్నారు. రాష్ట్ర విభజన వద్దని పోరాటం చేసిన ఒకే ఒక వ్యక్తి కేవీపీ రామచంద్రరావు అని వెంకయ్య చెప్పారు. కేవీపీ ఒక పట్టువీడని విక్రమార్కుడిలా పోరాటం చేశారని కితాబిచ్చారు. కేవీపీ మినహా మిగిలిన నేతలంతా ఆనాడే సర్దేసుకున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీకి హోదా వచ్చే అవకాశం లేదని వెంకయ్యమరోసారి స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం సూచన మేరకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్నారు. హోదాతో ప్రతి ఊరూ హైదరాబాద్‌ అన్న ప్రచారం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను తప్పనిసరిగాకేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి తీరుతుందని వెంకయ్య చెప్పారు.

Click on Image to Read:

pawan

rajashekar-reddy-ysr

pawan

pawan-interview

chandrababu-naidu-comments-on-political-carear

pawan-kalyan

chintakayala-chinna-rajappa

mudragada-ysrcp

pawan-twitter

ys-jagan
pawan-meeting-kakinada

ysrcp-1

ap-assembly-media-point

ap-assembly-sessions

venkaiah-naidu

kodela shiva rama krishna 1

pvnarasimharao-kotla-vijaya-bhaskar-reddy

avanthi-srinivas-haribabu

koratala-siva-vs-boyapati-srinu