వెంకీ సరసన నిత్యామీనన్

వెంకీకి హీరోయిన్ దొరకడం అంటే అది మామూలు విషయం కాదు. బాగా సీనియర్లు అయిపోయిన వెంకీ, నాగ్, బాలయ్య, చిరంజీవి లాంటి స్టార్స్ కు హీరోయిన్లను వెదికి పట్టుకోవడమే పెద్ద సమస్య. మొత్తానికి మరోసారి అలాంటి సమస్య నుంచి త్వరగానే గట్టెక్కాడు విక్టరీ వెంకటేష్. తన కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు నిత్యామీనన్ ఒప్పుకోవడంతో గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు. త్వరలోనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు వెంకటేష్. ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యామీనన్ ను ఎంపిక చేశారు. నిజానికి నిత్యా కంటే ముందే కాజల్ ను అనుకున్నప్పటికీ… క్యారెక్టర్ పరంగా నిత్యామీనన్ అయితే సినిమాకు మరింత బాగుంటుందని భావించారు. నిత్యామీనన్ కూడా ఒప్పుకోవడంతో వెంటనే ఒప్పందం జరిగిపోయింది. మల్టీడైమన్షన్ బ్యానర్ పై రామ్ మోహన్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం వెంకటేష్… సాలా ఖదూస్ అనే రీమేక్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకు, కిషోర్ తిరుమల షూటింగ్ కూడా మొదలవుతుంది. ఈ సినిమాకు ఆడాళ్లూ మీకు జోహార్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.