Telugu Global
Cinema & Entertainment

డైరెక్టర్ శంకర్ ఆ సీనియర్ యాక్టర్‌ని అడ్డుకున్నాడా?

దేవుడు వరమిచ్చినా… పూజారి వరమివ్వడనే సామెత మనకు ఉండనే ఉంది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ ఇంకా ధృవ పరిచినట్లయ్యింది. తమిళ సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ మళ్ళీ సినిమాలతో బిజీ కావాలని నిర్ణయించుకున్న తర్వాత, ఒక రోజు సూపర్‌స్టార్ రజినికాంత్ పిలిచి.. తన ‘2.0 ‘ లో విలన్ రోల్ ఉందని.. అది చేయడం శరత్ కుమార్‌కి ఇష్టమేనా అని అడిగినప్పుడు… శరత్ కుమార్ వెంటనే ఒప్పేసుకున్నాడట. కాని డైరెక్టర్ శంకర్ మాత్రం తన సినిమాలో ఇంటర్‌నేషనల్ […]

డైరెక్టర్ శంకర్ ఆ సీనియర్ యాక్టర్‌ని అడ్డుకున్నాడా?
X

దేవుడు వరమిచ్చినా… పూజారి వరమివ్వడనే సామెత మనకు ఉండనే ఉంది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ ఇంకా ధృవ పరిచినట్లయ్యింది. తమిళ సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ మళ్ళీ సినిమాలతో బిజీ కావాలని నిర్ణయించుకున్న తర్వాత, ఒక రోజు సూపర్‌స్టార్ రజినికాంత్ పిలిచి.. తన ‘2.0 ‘ లో విలన్ రోల్ ఉందని.. అది చేయడం శరత్ కుమార్‌కి ఇష్టమేనా అని అడిగినప్పుడు… శరత్ కుమార్ వెంటనే ఒప్పేసుకున్నాడట. కాని డైరెక్టర్ శంకర్ మాత్రం తన సినిమాలో ఇంటర్‌నేషనల్ అప్పీల్ ఇవ్వగల విలన్ కోసం బాలివుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని ఎంచుకున్నాడట.. శరత్ కుమార్ కి మొండి చెయ్యి చూపించాడట. నోటి వరకు వచ్చిన బువ్వ చేజారిపోవడం అంటే ఇదేనన్న మాట. కాని ఈ సీనియర్ హీరో మెల్లమెల్లగా బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం జి.వి.ప్రకాష్ కుమార్ నటిస్తున్న సినిమాలో ప్రాముఖ్యత ఉన్న రోల్ కొట్టేసాడు.

First Published:  11 Sep 2016 10:24 PM GMT
Next Story