Telugu Global
NEWS

విమోచ‌నంపై బీజేపీ చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలా?

తెలంగాణ విమోచ‌నం జ‌ర‌పాల్సిందే అంటూ కొంత‌కాలంగా బీజేపీ నాయ‌కులు తెలంగాణ‌లో స్వ‌రం పెంచుతూ వ‌స్తున్నారు. ఈ విమోచ‌నం జ‌ర‌ప‌మ‌నడానికి వారు చెబుతున్న కార‌ణం ఎలా ఉందంటే..?  బీజేపీ- ఆరెస్సెస్ లు అప్ప‌టి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాయి అన్న‌ట్లుగా ఉంది. వాస్త‌వానికి నైజాం రాజుకు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్ సంస్థానంలో జ‌రిగిన తెలంగాణ సాయుధ‌పోరాటంలో ఆరెస్సెస్ పాల్గొందా?  బీజేపీ అప్ప‌టికి ఆవిర్భ‌వించిందా? అంటే ఈ రెండు సంస్థ‌ల‌కు తెలంగాణ ఉద్య‌మానికి అస్స‌లు ఏమాత్రం సంబంధం లేవ‌ని తెలంగాణ‌లో చిన్న‌పిల్లాడిని […]

విమోచ‌నంపై బీజేపీ చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలా?
X
తెలంగాణ విమోచ‌నం జ‌ర‌పాల్సిందే అంటూ కొంత‌కాలంగా బీజేపీ నాయ‌కులు తెలంగాణ‌లో స్వ‌రం పెంచుతూ వ‌స్తున్నారు. ఈ విమోచ‌నం జ‌ర‌ప‌మ‌నడానికి వారు చెబుతున్న కార‌ణం ఎలా ఉందంటే..? బీజేపీ- ఆరెస్సెస్ లు అప్ప‌టి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాయి అన్న‌ట్లుగా ఉంది. వాస్త‌వానికి నైజాం రాజుకు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్ సంస్థానంలో జ‌రిగిన తెలంగాణ సాయుధ‌పోరాటంలో ఆరెస్సెస్ పాల్గొందా? బీజేపీ అప్ప‌టికి ఆవిర్భ‌వించిందా? అంటే ఈ రెండు సంస్థ‌ల‌కు తెలంగాణ ఉద్య‌మానికి అస్స‌లు ఏమాత్రం సంబంధం లేవ‌ని తెలంగాణ‌లో చిన్న‌పిల్లాడిని అడిగినా చెబుతాడు. 1948లో హైద‌రాబాద్ సంస్థానం భార‌త్‌లో విలీన‌మైంది. 1980 త‌రువాత బీజేపీ ఆవిర్భ‌వించింది. మ‌రి అలాంట‌ప్పుడు బీజేపీ ఎలా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంది? మ‌రి అలాంట‌పుడు ఎందుకు బీజేపీ ఈ నినాదాన్ని నెత్తిన వేసుకుంది. అంటే ఒక‌టే సింపుల్ లాజిక్! అప్ప‌టి హైదరాబాద్ సంస్థానం రాజు ముస్లిం. మెజారిటీ ప్ర‌జ‌లు హిందువులు. నైజాం సైన్యంగా చెప్పుకునే ర‌జాకార్లు హిందువుల‌ను నానా ర‌కాలుగా హింసించేవారు.
ఇప్పుడు ర‌జాకార్ల అరాచ‌కాలు బ‌య‌టికి తీసుకురావ‌డం ద్వారా మ‌రోసారి హిందు-ముస్లింల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన విభ‌జ‌న రేఖ వ‌స్తుంది..ఇది బీజేపీ ఓటు బ్యాంకు రాజ‌కీయం అని టీఆర్ ఎస్ వాదిస్తోంది. కాదు.. కాదు..అలాంటిదేమీ లేదంటూనే విమోచ‌న దినాన్ని జ‌ర‌పాలన్న డిమాండ్‌పై క‌మ‌ల‌నాథులు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఈ విష‌యంలో బీజేపీనేత‌లు నిజామాబాద్ ఎంపీ క‌విత మ‌ధ్య మాట‌ల యుద్ధ‌మే న‌డుస్తోంది. ఈ విష‌యంలో కమ్యూనిస్టులు సైతం బీజేపీ తీరును తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ధ్వజమెత్తారు. సాయుధ పోరాటానికి .. ఆరెస్సెస్, బీజేపీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బద్దం ఎల్లారెడ్డి, ముగ్దూం మొహియుద్దీన్, రావి నారాయణ రెడ్డి సంతకాలు చేసి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజును పురస్కరించుకొని ఆదివారం సీపీఐ గ్రేటర్ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ సంద‌ర్భంగా బీజేపీ తీరును తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు నారాయ‌ణ‌. తెలంగాణ పోరాటంలో ప్రాణాలొడ్డి పోరాడింది క‌మ్యూనిస్టులేన‌ని స్ప‌ష్టం చేశారు. ఆనాటి పోరాట కాలం నాటికి ఇంకా బీజేపీ పుట్టనే లేదు. ఒక్క ఆరెస్సెస్ కార్య‌క‌ర్త పాల్గొన‌లేదు. అలాంట‌పుడు విమోచ‌న దినంపై మాట్లాడే హ‌క్కు బీజేపీకి ఎక్క‌డిది? అని ప్ర‌శ్నించారు. నారాయ‌ణ మాట‌ల‌తో బీజేపీ ఇరుకున పడిన‌ట్ల‌యింది.
First Published:  11 Sep 2016 9:00 PM GMT
Next Story