Telugu Global
Cinema & Entertainment

ఓవర్సీస్ లో ప్రస్తుతం దీనిదే పైచేయి

కంటెంట్ బాగుంటే కటౌట్ తో పనిలేదని మరోసారి నిరూపించారు ఓవర్సీస్ జనాలు. జ్యో అచ్యుతానంద సినిమాకు క్యూలు కడుతున్నారు. నారా రోహిత్-నాగశౌర్య హీరోలుగా నటించిన ఈ సినిమాను చూసేందుకు ఓవర్సీస్ జనాలు ఎగబడుతున్నారు. అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ క్లాసిక్ మూవీ లోకల్ గానే కాకుండా.. ఓవర్సీస్ లో కూడా హిట్ అయింది. మరీ ముఖ్యంగా అవసరాల తెరకెక్కించిన సెన్సిబుల్ కామెడీ, సెకండాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు అమెరికా జనాలకు పిచ్చపిచ్చగా నచ్చాయి. అందుకే సినిమాకు కాసుల […]

ఓవర్సీస్ లో ప్రస్తుతం దీనిదే పైచేయి
X

కంటెంట్ బాగుంటే కటౌట్ తో పనిలేదని మరోసారి నిరూపించారు ఓవర్సీస్ జనాలు. జ్యో అచ్యుతానంద సినిమాకు క్యూలు కడుతున్నారు. నారా రోహిత్-నాగశౌర్య హీరోలుగా నటించిన ఈ సినిమాను చూసేందుకు ఓవర్సీస్ జనాలు ఎగబడుతున్నారు. అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ క్లాసిక్ మూవీ లోకల్ గానే కాకుండా.. ఓవర్సీస్ లో కూడా హిట్ అయింది. మరీ ముఖ్యంగా అవసరాల తెరకెక్కించిన సెన్సిబుల్ కామెడీ, సెకండాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు అమెరికా జనాలకు పిచ్చపిచ్చగా నచ్చాయి. అందుకే సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. ప్రీమియర్స్ ద్వారా దాదాపు 27వేల డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా శుక్రవారం రోజున ఏకంగా 90 వేల డాలర్లు వసూలు చేసింది. మొదటి షో నుంచే టాక్ అదిరిపోవడంతో రెండో రోజు నుంచి కలెక్షన్స్‌లో జోరు పెంచింది. శనివారం అయితే దాదాపు తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమా చూసేందుకే ఇంట్రెస్ట్ చూపించారు. ఆ ఒక్క రోజే దాదాపు లక్షా 20వేల డాలర్లు వచ్చి ఉంటాయని అంచనా. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రోహిత్-శౌర్యల మధ్యన వచ్చే ఎమోషనల్ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ రమణ అందించిన మ్యూజిక్ కూడా ఓ హైలైట్‌గా నిలిచింది.

First Published:  11 Sep 2016 10:29 PM GMT
Next Story