Telugu Global
NEWS

మంత్రి కేటీఆర్ కు అదనపు బాధ్య‌త‌లు!

తెలంగాణ ఐటీ- పంచాయ‌తీరాజ్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి, మునిసిప‌ల్‌ శాఖల‌కు మంత్రిగా ఉన్న కేటీఆర్ కు త్వ‌ర‌లో మ‌రో బాధ్య‌త అప్ప‌జెప్ప‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం కేటీఆర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. క‌రీంన‌గ‌ర్ లో జ‌గిత్యాల‌, పెద్ద‌ప‌ల్లి రెండు జిల్లాలు అద‌నంగా ఏర్పాటుకానున్నాయి. వీటిలో పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు మంత్రి కేటీఆర్‌కు అప్ప‌జెప్ప‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ విష‌యంపై కేసీఆర్ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటార‌ని పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. పెద్ద‌ప‌ల్లి జిల్లా బాధ్య‌త‌ల‌ను కేటీఆర్ కు అప్ప‌గించ‌డం […]

మంత్రి కేటీఆర్ కు అదనపు బాధ్య‌త‌లు!
X
తెలంగాణ ఐటీ- పంచాయ‌తీరాజ్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి, మునిసిప‌ల్‌ శాఖల‌కు మంత్రిగా ఉన్న కేటీఆర్ కు త్వ‌ర‌లో మ‌రో బాధ్య‌త అప్ప‌జెప్ప‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం కేటీఆర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. క‌రీంన‌గ‌ర్ లో జ‌గిత్యాల‌, పెద్ద‌ప‌ల్లి రెండు జిల్లాలు అద‌నంగా ఏర్పాటుకానున్నాయి. వీటిలో పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు మంత్రి కేటీఆర్‌కు అప్ప‌జెప్ప‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ విష‌యంపై కేసీఆర్ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటార‌ని పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. పెద్ద‌ప‌ల్లి జిల్లా బాధ్య‌త‌ల‌ను కేటీఆర్ కు అప్ప‌గించ‌డం వెన‌క భారీ వ్యూహం దాగి ఉంద‌ని అంటున్నారు గులాబీపార్టీ నేత‌లు. ఇప్ప‌టి వ‌ర‌కు సింగ‌రేణి బావులు, ఎఫ్‌సీఐ, ఎన్టీపీసీ, కేశోరాం సిమెంట్ ఫ్యాక్ట‌రీ త‌దిత‌ర భారీ ప‌రిశ్ర‌మ‌లున్న ప్రాంతాల‌న్నీ ఇప్పుడు కొత్త‌గా ఏర్ప‌డ‌బోయే పెద్ద‌ప‌ల్లి ప‌రిధిలోకి రానున్నాయి.
దేశంలోని ప్ర‌ముఖ విద్యుత్తు ఉత్ప‌త్తి కేంద్రాల్లో ఒక‌టైన రామ‌గుండంలోని ఎన్టీపీసీ, త్వ‌ర‌లో పునః ప్రారంభం కానున్న రామగుండం ఎరువుల క‌ర్మాగారాలు కూడా పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిధిలోనే ఉంటాయి. ఈ ప్రాంతంలోనే విమానాశ్రయం, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పైగా గోదావ‌రి తీర ప్రాంతం. పారిశ్రామికంగా మ‌రింత అభివృద్ధి చెందేందుకు పుష్క‌లంగా అవ‌కాశాలున్న‌ ప్రాంతం. అందుకే, వ్యూహాత్మ‌కంగా కేటీఆర్ కు ఈ ప్రాంతంలో పార్టీ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించ‌నున్నార‌ని స‌మాచారం. ఇంత‌వ‌ర‌కు తెలంగాణ‌లో హైద‌రాబాద్ త‌రువాత ధ‌నిక జిల్లాగా క‌రీంన‌గ‌ర్‌కు పేరు రావ‌డానికి కార‌ణం ఈ ప్రాంతంలోని ప‌రిశ్ర‌మ‌లే. ఇక నుంచి ఆ ప్రాంతం క‌రీంన‌గ‌ర్ నుంచి వేరుప‌డి పెద్ద‌ప‌ల్లిలోకి వెళుతుండటంతో ముందుగానే అల‌ర్ట‌యిన అధిష్టానం ఈ ప్రాంతంపై కేటీఆర్ ప‌ట్టు సాధించేలా పావులు క‌దుపుతోంద‌ని స‌మాచారం. గ‌తంలో రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా దేశంలోనే అతిపెద్ద ఐటీ ప్రాజెక్టు ఐటీఐఆర్‌ను కేంద్రం హైద‌రాబాద్ న‌గ‌రానికి కేటాయించింది. ఆ త‌రువాత ఐటీ మంత్రిగా కేటీఆర్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు భారీ ప‌రిశ్ర‌మ‌లు, ర‌వాణా, జ‌ల‌, రోడ్డు మార్గాలున్న పెద్ద‌ప‌ల్లి బాధ్య‌త‌లు కేటీఆర్ కే అప్ప‌జెప్ప‌డం వ్యూహాత్మ‌క‌మేనంటున్నారు పార్టీలోని పెద్ద‌లు.
First Published:  11 Sep 2016 11:50 PM GMT
Next Story