వీరి జెండా, అజెండా అనుమానాస్పదమా?

“ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగిఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు” అంటాడు లెనిన్. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనూ ఇది నిజమే అనిపిస్తుంది. ప్రత్యేక హోదా అంశంలో కొందరు నేతలు, మేధావులు వేస్తున్న విన్యాసాలు బహు చిత్రముగా ఉండును. వారిలో ముఖ్యంగా సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, మానసిక విశ్లేషకుడిగా టీవీ చర్చల్లో పాల్గొనే సి. నరసింహరావు,  నటుడు శివాజీ, మేధావి చలసాని శ్రీనివాస్‌లపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. హోదా అంశంలో చంద్రబాబును తెలివిగా అమాయకుడు అన్న కలరింగ్ ఇస్తున్నారన్నది వీరిపై ప్రధాన విమర్శ. వారు అలా ఎందుకు చేస్తున్నారంటే… నెటిజన్ల అనుమానం ఏమిటంటే…

హోదా విషయంలో విమర్శించాల్సి వచ్చిన ప్రతిసారీ నారాయణ, రామకృష్ణ, పవన్ కల్యాణ్,  శివాజీ, చలసాని శ్రీనివాసులు వెంకయ్యనాయుడు, బీజేపీనే గట్టిగా విమర్శిస్తున్నారు. పుట్టింది ఏపీలోనే అయినా ఇక్కడి నుంచి తాను ప్రాతినిధ్యం వహించడం లేదని, ఏదో పుట్టిన గడ్డపై అభిమానంతోనే ఏపీకి సాయం చేస్తుంటానని వెంకయ్య చెబుతుంటారు. ఆయన చెప్పిన దాంట్లోనూ కొద్దిమేర నిజం ఉంది. కానీ హోదా విషయంలో వెంకయ్యనాయుడిని టార్గెట్‌గానే విరుచుకుపడుతున్నారు ఇక్కడి కొందరు నేతలు. వెంకయ్యే కాదు తిరుపతి వేదికగా ఎన్నికల సమయంలో ఏకంగా 15 ఏళ్లుప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన వ్యక్తి చంద్రబాబు. కానీ హోదా ఇవ్వడం లేదని కేంద్రం తేల్చిచెప్పిన తర్వాత కూడా చంద్రబాబు ఏం చేస్తున్నారన్న దానిపై మేధావులు, అనుమానాస్పద నేతలు ప్రశ్నించరు. సీపీఐ నారాయణ పదేపదే వెంకయ్య పంచెలో ఉన్న దాని గురించే మాట్లాడుతారు గానీ…కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కూడా హోదా సాధించలేకపోయిన చంద్రబాబు ఫ్యాంట్‌ గురించి మాత్రం మాట్లాడరు. దేశానికి వెంకయ్య ప్రధాని అయినట్టు ఆయన వల్లే హోదా రావడం లేదన్నట్టుగా జనాన్ని భ్రమింపచేస్తుంటారు.

హోదా అంశం తెరపైకి వచ్చిన ప్రతీసారి కలుగులో నుంచి వచ్చే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా బీజేపీని తిడుతారే గానీ సాధించలేక ప్యాకేజ్‌ను స్వాగతించిన చంద్రబాబును మాత్రం ఏమీ అనరు. హోదా కోసం కేంద్రంతో చంద్రబాబు యుద్ధమే చేస్తున్నారనుకుందాం. ఆ పోరాటం ఓడిపోతే అది చంద్రబాబు చేతగానితనమే అనాలి గానీ… మా బాబును మీరు ఎలా ఓడిస్తారు అంటూ కేంద్రం మీద పడితే ఏమొస్తుంది. మన చేత గాని తనాన్ని కప్పి పుచ్చుకోవడం మినహా!. ప్యాకేజ్‌ను అంగీకరిస్తే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహుతి చేసుకుంటాను, తాను అందరిలాంటివాడిని కాదు, మాట మీద నిలబడే వ్యక్తిని అని ప్రముఖ న్యూస్ ఛానల్ లో కోతలు కోసిన శివాజీ ఇప్పుడేం చేస్తున్నారో!. ప్యాకేజ్‌కు స్వాగతించడం అయిపోయింది, ప్రత్యేక హోదా అవసరం లేదని టీడీపీ నేతలే ప్రకటించడమూ జరిగింది, కానీ శివాజీ మాత్రం మాట నిలుపుకోలేదు. ఇక మానసిక విశ్లేషకుడిగా టీవీ రాజకీయ చర్చల్లో పాల్గొనే సి. నరసింహరావు అయితే ఓపెన్ గానే చంద్రబాబుకు వకాల్తా పుచ్చుకుని వాదిస్తుంటారు. చంద్రబాబుకు వంతపాడుతున్నట్టుగా అనుమానాస్పదంగా వ్యవహరించే సదరు వ్యక్తుల మీడియా సమావేశాలను బాగా గమనిస్తే … భారత యుద్ధంలో ధర్మరాజు అబద్దాన్ని గట్టిగా చెప్పి నిజాన్ని చిన్నగా గొణిగినట్టు వెంకయ్యనాయుడుతో పాటు చంద్రబాబును కూడా రెండు మాటలు విమర్శించే వెళ్తారు. కానీ వెంకయ్యపై వేసే పంచెడైలాగుల రేంజ్‌లో బాబుపై విమర్శలు మాత్రం చేయరు. వీరు ఇలా చేయడానికి కారణం వేరే ఉందని చెబుతున్నారు నెటిజన్ లు… అదేంటంటే…

వెంకయ్యనాయుడిని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేసే వారి ఉద్దేశం చంద్రబాబు క్షేమమే. చంద్రబాబు బాగుంటేనే తమ బతుకు చిత్రం బాగుంటుందన్నది వీరి ఉద్దేశం అని చెబుతున్నారు. వెంకయ్యనాయుడును ఎంతగా విమర్శించినా ఆయనకువచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరు కాబట్టి. ఆయన టీడీపికి పెద్ద దిక్కుకాదు కాబట్టి. అదే చంద్రబాబును విమర్శిస్తే రాజకీయంగా టీడీపీకి చాలా దెబ్బతగులుతుంది. అందుకే హోదా రాకపోవడానికి ఏకైక కారణం వెంకయ్యనాయుడే…. చంద్రబాబుకు ఏ పాపం తెలియదన్న భ్రమ కలిగించేందుకు కొందరు అంతర్గతంగా పనిచేస్తున్నారని నెటిజన్ల అనుమానం.

Click on Image to Read:

ntr

chevi-reddy-bhaskareddy-comments

gali-muddu-krishnama-naidu

pawan

kottapalli-geeta

sabbam-hari

alla-ramakrishna-reddy

 

chandrababu

 

c-ramachandraiah

 

chandrababu-courts

rajashekar-reddy-ysr

chandrababu-naidu-01

chintakayala-chinna-rajappa