Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ @67 కోట్లు..!

ఇండియాలో సినిమా అంటే   హీరోనే.  హోరో చుట్టే క‌థ న‌డుస్తుంటుంది.   హీరోయిన్ పేరుకు ఉంటుంది.  ఉన్నంతలోనే ఆడియ‌న్స్ ను మెప్పించాల్సి వుంటుంది.  లాంగ్వేజ్ ఏదైనా  క‌మ‌ర్షియ‌ల్  హీరోయిన్ల ప‌రిస్థితి అంత‌టా కాస్త  లెఫ్ట్ అండ్ రైట్ ఒకేలా ఉంటుంది. క‌ట్ చేస్తే..  ఇదే త‌ర‌హాలో బి టౌన్ లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అనిపించుకుని..  ప్ర‌స్తుతం  హాలీవుడ్  లోను న‌టిగా త‌న స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్న హీరోయిన్ దీపిక ప‌దుకోణ్‌.. తాజాగా ఫోర్బ్స్ మ్యాగ్జిన్ వాళ్లు […]

హీరోయిన్ @67 కోట్లు..!
X

ఇండియాలో సినిమా అంటే హీరోనే. హోరో చుట్టే క‌థ న‌డుస్తుంటుంది. హీరోయిన్ పేరుకు ఉంటుంది. ఉన్నంతలోనే ఆడియ‌న్స్ ను మెప్పించాల్సి వుంటుంది. లాంగ్వేజ్ ఏదైనా క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ల ప‌రిస్థితి అంత‌టా కాస్త లెఫ్ట్ అండ్ రైట్ ఒకేలా ఉంటుంది. క‌ట్ చేస్తే.. ఇదే త‌ర‌హాలో బి టౌన్ లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అనిపించుకుని.. ప్ర‌స్తుతం హాలీవుడ్ లోను న‌టిగా త‌న స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్న హీరోయిన్ దీపిక ప‌దుకోణ్‌..

తాజాగా ఫోర్బ్స్ మ్యాగ్జిన్ వాళ్లు విడుదల చేసిన వివరాల ప్రకారం.. దీపిక సంపాదన విషయంలో టాప్ టెన్ నటీమణుల్లో పదో స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం దీపిక సంపాదన పది మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే కోటి డాలర్లు. భారత ద్రవ్యమానంలో చెప్పాలంటే దాదాపు 67 కోట్ల రూపాయలు!

ఇదీ దీపిక ఒక సంవత్సరంలో సంపాదిస్తున్న డబ్బు. బాలీవుడ్ లో టాప్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న దీపిక అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. దీంతో ఆమెకు అంత డబ్బు వస్తోందని ఫోర్బ్స్ పేర్కొంది.ఆమె నటించిన తొలి హాలీవుడ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రిప్లెక్స్ సీరిస్ లోని సినిమా కాబట్టి.. దీపికకు కావాల్సినంత గుర్తింపు కూడా దక్కుతోంది ఆ సినిమాతో. మరి అది విడుదల అయ్యి.. హాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు విస్తృతమయితే.. ప్రస్తుతం సంపాదనలో తనకన్నా పై స్థాయిలో ఉన్న హాలీవుడ్ భామలకు కూడా దీపిక పోటీ ఇస్తుందేమో! రెమ్యున్ రేష‌న్ విష‌యంలో హీరోల‌కు ..హీరోయిన్స్ కు ఎంతో వ్య‌త్యాసం వుండే ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో దీపిక ప‌దుకోణ్ ఏడాదికి దాదాపు 67 కోట్లు సంపాదించ‌డం అనేది నిజంగా గొప్ప విష‌యమే. హాలీవుడ్ ఆఫ‌ర్స్ సంపాదించగలిగింది కాబ‌ట్టి ఇది సాధ్యం అయ్యిందంటున్నారు ప‌రిశీల‌కులు.

First Published:  13 Sep 2016 4:42 AM GMT
Next Story