Telugu Global
Cinema & Entertainment

నాని కి రాజ‌మౌళి మాట  అంటే వేద‌వాక్కే..! 

తెలుగు సినిమా మార‌దా ? అటూ  మ‌నం ఇప్పుడు చేస్తున్న  ఫిర్యాదుల‌న్నీ మరి  కొన్ని  రోజుల్లో  వినిపించ‌వు.  అంతా ఆశిస్తున్న  ఆ మార్పు ఎంతో దూరంలో లేదు. ఇటీవ‌ల యువ ద‌ర్శ‌కులు  చెప్పిన క‌థ‌ల్ని  విరివిగా   వింటున్న‌ప్పుడు  త‌న‌కు క‌లిగిన అభిప్రాయ‌మ‌ని తెలిపాడు నానీ.  క‌థా నాయ‌కుడిగా నాని . ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన  క‌థ‌ల‌తో  ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారీయ‌న‌. భలే భలే మోగాడివోయ్, కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ‌, జెంటిల్ మన్ వంటి చిత్రాల‌తో  స‌క్సెస్ లు […]

నాని కి రాజ‌మౌళి మాట  అంటే వేద‌వాక్కే..! 
X
తెలుగు సినిమా మార‌దా ? అటూ మ‌నం ఇప్పుడు చేస్తున్న ఫిర్యాదుల‌న్నీ మరి కొన్ని రోజుల్లో వినిపించ‌వు. అంతా ఆశిస్తున్న ఆ మార్పు ఎంతో దూరంలో లేదు. ఇటీవ‌ల యువ ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌ల్ని విరివిగా వింటున్న‌ప్పుడు త‌న‌కు క‌లిగిన అభిప్రాయ‌మ‌ని తెలిపాడు నానీ. క‌థా నాయ‌కుడిగా నాని . ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారీయ‌న‌. భలే భలే మోగాడివోయ్, కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ‌, జెంటిల్ మన్ వంటి చిత్రాల‌తో స‌క్సెస్ లు అందుకున్న నాని.. తాజా గా ఉయ్యాల జంపాలా చిత్ర ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ తో మ‌జ్ను చిత్రం చేశాడు. ఈ చిత్రంలో నాని బాహుబ‌లి సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా క‌నిపిస్తార‌ట‌. ఈ సినిమాలో రాజ‌మౌళి గారు ఒక్క‌రే క‌నిపిస్తారా..? బాహుబ‌లి బృందం కూడా కనిపిస్తుందా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నాని రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో ఈగ అనే చిత్రం చేసిన విష‌యం తెలిసిందే. అయినా సినిమా చేయ‌మ‌ని అడ‌గాలే గాని..అన్ని వ‌దిలేసి ప‌రిగెడ‌తార‌ట‌. ఇక మ‌జ్ను చిత్రం తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రికొత్త ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంది అంటున్నారు. ఈ నెల 23 న మ‌జ్ను చిత్రం గ్రాండ్ రిలీజ్ కు ప్రొడ్యూస‌ర్ దాస‌రి కిర‌ణ్ కుమార్ రంగం సిద్దం చేశారు.
First Published:  13 Sep 2016 2:44 AM GMT
Next Story