Telugu Global
Cinema & Entertainment

కార్తితో బిచ్చగాడు హీరోయిన్ రహస్య వివాహం

బిచ్చగాడు సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చేసింది సాట్నా టైటస్. ఈ పేరు చెబితే చాలామంది తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టరేమో కానీ… బిచ్చగాడు బ్యూటీ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా అఖండ విజయం సాధించడంతో… ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సాట్నా. ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ వార్తల్లోకెక్కింది. అది కూడా రహస్యంగా పెళ్లి చేసుకొని హాట్ టాపిక్ గా మారిపోయింది.  బిచ్చగాడు సినిమాను మేజర్ ఏరియాస్ లో […]

కార్తితో బిచ్చగాడు హీరోయిన్ రహస్య వివాహం
X
బిచ్చగాడు సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చేసింది సాట్నా టైటస్. ఈ పేరు చెబితే చాలామంది తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టరేమో కానీ… బిచ్చగాడు బ్యూటీ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా అఖండ విజయం సాధించడంతో… ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సాట్నా. ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ వార్తల్లోకెక్కింది. అది కూడా రహస్యంగా పెళ్లి చేసుకొని హాట్ టాపిక్ గా మారిపోయింది.
బిచ్చగాడు సినిమాను మేజర్ ఏరియాస్ లో పంపిణీ చేసిన కార్తి అనే వ్యక్తితో సాట్నా కొన్ని రోజులుగా లవ్ లో ఉంది. తాజాగా ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. అయితే ఈ వివాహం అత్యంత గోప్యంగా జరిగినప్పటికీ… రెండు కుటుంబాల అంగీకారంతోనే జరిగినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న సాట్నా తల్లిదండ్రులు, త్వరలోనే ఈ మేటర్ పై సాట్నా ఓ క్లారిటీ కూడా ఇవ్వనుందని తెలుస్తోంది.
First Published:  14 Sep 2016 4:40 AM GMT
Next Story