Telugu Global
NEWS

అసలు ఉద్దేశాన్ని బయటపెట్టిన పచ్చ సర్వే

ఏపీకి పత్ర్యేక హోదా విషయంలో పంగనామలు పెట్టింది బీజేపీ. పంగనామాలే మహా ప్రసాదం అన్నట్టు స్వీకరించారు చంద్రబాబు. మధ్యలో జనం మాత్రం రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనుకూల మీడియా సంస్థ ఒక విచిత్ర వార్తను ప్రచురించింది. ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించేందుకు సిద్ధమైన వేళ ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై చంద్రబాబు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మెరుపు సర్వే నిర్వహించారట. అది ఎలా నిర్వహించారో మాత్రం సదరు పత్రిక రాయలేదు. సర్వేలో 60 నుంచి 75 శాతం మంది […]

అసలు ఉద్దేశాన్ని బయటపెట్టిన పచ్చ సర్వే
X

ఏపీకి పత్ర్యేక హోదా విషయంలో పంగనామలు పెట్టింది బీజేపీ. పంగనామాలే మహా ప్రసాదం అన్నట్టు స్వీకరించారు చంద్రబాబు. మధ్యలో జనం మాత్రం రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనుకూల మీడియా సంస్థ ఒక విచిత్ర వార్తను ప్రచురించింది. ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించేందుకు సిద్ధమైన వేళ ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై చంద్రబాబు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మెరుపు సర్వే నిర్వహించారట. అది ఎలా నిర్వహించారో మాత్రం సదరు పత్రిక రాయలేదు.

సర్వేలో 60 నుంచి 75 శాతం మంది ప్రత్యేక హోదా అంటే ఏమిటో తమకు తెలియదని చెప్పారట. హోదా కావాలని కోరిన వారు కూడా హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు తమకు తెలియవని చెప్పారట. ప్రజల స్పందన ఇలా ఉండడం చూసిన తర్వాతే ప్రత్యేక ప్యాకేజ్‌ తీసుకునేందుకు చంద్రబాబు ధైర్యంగా ముందుకొచ్చారని రాసుకొచ్చింది. అయితే కథలు అల్లి రాయడంలో ఆరితేరిన పేరున్న సదరు పత్రిక… చంద్రబాబు ప్యాకేజ్‌ను సమర్థించే ప్రయత్నంలో ఒక విషయాన్ని మరిచిపోయింది. 60 నుంచి 75 శాతం మందికి ప్రత్యేక హోదా ప్రయోజనాల గురించి తెలియదని తేలిన తర్వాతే ప్యాకేజ్‌ తీసుకున్నట్టు చెబుతున్నారు. అంటే జనానికి హోదా గురించి తెలుసుకునేంతటి తెలివితేటలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే చంద్రబాబు ప్యాకేజ్ కు ఓకే చేసినట్టు భావించాలా?. సరే ఒకవేళ హోదా గురించి జనంలో అవగాహన లేదనుకుందాం. కానీ హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు రాజకీయ నేతలకు తెలుసు కదా!. హోదా గురించి ప్రజలకు తెలియదన్న ఒకే ఒక్క కారణంతో ప్యాకేజ్‌కు సై అంటారా?. బాబుకు జాకీలు పెట్టే మరో రెండు పాయింట్లను కూడా సదరు పత్రిక అచ్చేసింది.

టీడీపీ కేంద్రం నుంచి బయటకు వచ్చినా బీజేపీకి వచ్చే ఇబ్బంది ఉండదు కాబట్టి కేంద్రంలో కొనసాగుతూనే ఇచ్చింది తీసుకోవడం మంచిదని అచ్చం చంద్రబాబు తరహాలోనే చాలా మంది సర్వేలో చెప్పారట. జనం నుంచి వచ్చిన ఈ స్పందన చూసి ఇంటెలిజెన్స్ వర్గాలే ఆశ్చర్యపోయాయట. బహుశా ఇంటెలిజెన్స్ వర్గాల రూపంలో సదరు పత్రిక యాజమాన్యమే టీడీపీ సానుభూతిపరుల దగ్గరకు వెళ్లి సర్వే చేసింది కాబోలు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Click on Image to Read:

chittoor-mayor-katari-anuradha

rosaiah

chandrababu-group-1-questions

chandrababu-naidu

renudesai-1

magunta-sreenivasulu-reddy

tangirala-sowmya

chandrababu-naidu-polavaram

mudragada-chandrababu-naidu

national-alliance-of-peoples-movements-ramakrishnama-raju

First Published:  15 Sep 2016 2:45 AM GMT
Next Story