మజ్ను బాటలో రామ్

మజ్ను సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ కు ముందే రెండు పాటల్ని ఎఫ్ఎం రేడియోలో రిలీజ్ చేశారు. ఇప్పుడు రామ్ కూడా అదే పని చేశాడు. తన కొత్త సినిమా హైపర్ కు సంబంధించిన పాటను ఓ టీవీ ఛానెల్ లో విడుదల చేశాడు. కాకపోతే నాని ఆడియో రిలీజ్ చేస్తే… రామ్ ఏకంగా వీడియో సాంగ్ నే విడుదల చేస్తున్నాడు. అదన్నమాట సంగతి. 14 రీల్స్ ఎఁటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈనెల 30న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ 15 రోజుల గ్యాప్ లోనే ఆడియోను విడుదల చేసి, ఫుల్లుగా ప్రమోషన్ ఇవ్వాలని అనుకుంటున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించాడు. నేను శైలజ సినిమా తర్వాత రామ్ నటిస్తున్న మూవీ ఇదే కావడంతో హైపర్ పై చాలా అంచనాలున్నాయి. తాజాగా విడుదల చేసిన ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. సినిమాలో రామ్ కు తండ్రిగా సత్యరాజ్ నటిస్తున్నాడు.