Telugu Global
Cinema & Entertainment

హీరో, నిర్మాత రెడీ... దర్శకుడి కోసం వెయిటింగ్...

 ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సెట్ అయింది. గోల్డెన్ హ్యాండ్ తో దూసుకుపోతున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతలు త్వరలోనే రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాది మధ్యలో లేదా ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. చెర్రీ కాల్షీట్లు ఇచ్చేశాడు. నిర్మాతలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇక దర్శకుడు దొరకడమే ఆలస్యం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే […]

హీరో, నిర్మాత రెడీ... దర్శకుడి కోసం వెయిటింగ్...
X

ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సెట్ అయింది. గోల్డెన్ హ్యాండ్ తో దూసుకుపోతున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతలు త్వరలోనే రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాది మధ్యలో లేదా ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. చెర్రీ కాల్షీట్లు ఇచ్చేశాడు. నిర్మాతలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇక దర్శకుడు దొరకడమే ఆలస్యం.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ఓ లవ్ సబ్జెక్ట్ లో నటించబోతున్నాడు. సుక్కూ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ నాటికి పూర్తిచేయాలనేది టార్గెట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చెర్రీ సినిమా ఉంటుంది. చెర్రీ ఏ దర్శకుడికి ఓకే చెప్పినా, అతడు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనే సినిమా చేయాల్సి ఉంటుంది. మరి ఆ అదృష్టవంతుడు ఎవరో చూడాలి.

First Published:  15 Sep 2016 5:15 AM GMT
Next Story