Telugu Global
NEWS

జపింగ్‌ వెనుక బెదిరింపా? బుజ్జగింపా?

ఆంధ్రప్రదేశ్‌ నేతల విన్యాసాలు బహుచిత్రముగా ఉన్నాయి. నిన్న తిట్టడం నేడు పొగడడం..కండువా మారకముందు అవినీతిలా అనిపించింది…కండువా మార్చగానే అవి అన్నీ నీతిపనులే అని అనిపిస్తున్నాయి మన నేతలకు. తాజాగా కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి చేరిన దేవినేని నెహ్రు కూడా అదే పనిచేశారు. టీడీపీని బండబూతులు తిట్టిన నెహ్రు ఇప్పుడు లోకేష్‌ వీరుడు, చంద్రబాబు శూరుడు అని బహిరంగసభలో వాయిద్యాలు వాయించారు. అయితే దేవినేని నెహ్రు, ఆయన కుమారుడు దేవినేని అవినాష్‌లను కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వెంటాడుతున్నాయి. […]

జపింగ్‌ వెనుక బెదిరింపా? బుజ్జగింపా?
X

ఆంధ్రప్రదేశ్‌ నేతల విన్యాసాలు బహుచిత్రముగా ఉన్నాయి. నిన్న తిట్టడం నేడు పొగడడం..కండువా మారకముందు అవినీతిలా అనిపించింది…కండువా మార్చగానే అవి అన్నీ నీతిపనులే అని అనిపిస్తున్నాయి మన నేతలకు. తాజాగా కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి చేరిన దేవినేని నెహ్రు కూడా అదే పనిచేశారు. టీడీపీని బండబూతులు తిట్టిన నెహ్రు ఇప్పుడు లోకేష్‌ వీరుడు, చంద్రబాబు శూరుడు అని బహిరంగసభలో వాయిద్యాలు వాయించారు. అయితే దేవినేని నెహ్రు, ఆయన కుమారుడు దేవినేని అవినాష్‌లను కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వెంటాడుతున్నాయి. కాంగ్రెస్‌లో ఉండగా దేవినేని నెహ్రు, అవినాష్ చంద్రబాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్‌కు సంబంధించిన మీటింగ్‌లో మాట్లాడిన నెహ్రు టీడీపీ తండ్రికొడుకులపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. రాజధాని ప్రకటించకముందే రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని ఆ సమయంలో ఆరోపించారు. వైఎస్ లక్ష కోట్లు దోచుకున్నారని చెబుతున్న లోకేష్‌… ఇప్పటికే రెండు లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. ఒకే చోట లోకేష్‌ 125 ఎకరాలు కొనుగోలు చేశారని నెహ్రు చెప్పారు. మంత్రులు, సామంతులు అంతా కలిసి భూములు కొనుగోలు చేశారని ఆ రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయని కాంగ్రెస్‌లో ఉండగా కొన్ని నెలల క్రితమే దేవినేని నెహ్రు ప్రకటించారు. త్వరలోనే విజయవాడలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి లోకేష్ తో పాటు రాజధానిలో ముందుగానే భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతల చిట్టాను బయటపెడుతానని దేవినేని నెహ్రు ప్రకటించారు. సీన్ అక్కడ కట్‌ చేస్తే…

గురువారం విజయవాడలో అయితే బహిరంగ సభ జరిగింది. కానీ లోకేష్‌ రెండు లక్షల కోట్ల అవినీతి, రాజధానిలో టీడీపీ నేతల భూముల చిట్టా విప్పేందుకు కాదు. దేనినేని నెహ్రుయే చంద్రబాబు గ్యాంగ్‌లో విలీనం అయ్యేందుకు. మొన్నటి వరకు అమరావతి మొత్తం టీడీపీ నేతల చేతుల్లో ఉందని… వారి చిట్టాను బయటపెడుతానన్న నెహ్రు గురువారం సభలో మాత్రం తాను అమరావతికి రక్షణ కవచంలా ఉంటానన్నారు. అమరావతి చంద్రబాబుదే అని సర్టిఫై చేసేశారు. అమరావతి సృష్టికర్త చంద్రబాబే.. దాన్ని నిర్మించే సత్తా ఆయనకు మాత్రమే ఉందని ఆకాశానికెత్తారు. ఆయన కుమారుడు దేవినేని అవినాష్ కూడా కొన్ని నెలల క్రితం విజయవాడలో రిలే దీక్షలు ప్రారంభించారు. చంద్రబాబు ఒక మోసకారి అని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగులందరినీ మోసం చేశారని విరుచుకుపడ్డారు. అంతేకాదు.. తన రిలే దీక్ష ప్రారంభం మాత్రమేనని త్వరలోనే అన్ని జిల్లాలు తిరిగి నిరుద్యోగులను సమీకరించి ప్రభుత్వంపై పోరాటం చేస్తానన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల జాబితాను సిద్ధం చేస్తామన్నారు. చంద్రబాబు మెడలు వంచి యువతకు న్యాయం చేస్తామన్నారు. కానీ గురువారం జరిగిన సభలో మాత్రం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు యువనేత అవినాష్. ఈ రోజు రాష్ట్రంలో యువత గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే అందుకు చంద్రబాబే కారణమని చెప్పుకొచ్చారు. ప్రతి యువకుడు చంద్రబాబును చూసుకుని ఇప్పుడు తన జీవితానికి ఎలాంటి భయం లేదని అనుకుంటున్నారని అవినాష్ చెప్పారు. ఇంతలోనే ఎంత మార్పు!. కొద్దిరోజుల క్రితమే చంద్రబాబు యువతను మోసం చేస్తున్నారని చెప్పిన అవినాష్‌.. ఇప్పుడు మాత్రం యువత మొత్తం చంద్రబాబు ఉన్నారన్న ధైర్యంలో గుండెల మీద చేయివేసుకుని నిద్రపోతున్నారని చెప్పారంటే కొత్త తరం రాజకీయంపైనా ఆశలు పెట్టుకోవడం అమాయకత్వమే అనిపిస్తోంది.

దేవినేని నెహ్రు, అవినాష్‌ నాడు నేడు చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేవినేని నెహ్రు టీడీపీలో చేరడం వెనుక కారణాలు విశ్లేషిస్తున్నారు. అమరావతిలో లోకేష్‌, టీడీపీ నేతల భూముల చిట్టాను బయటపెడుతానన్న నెహ్రుకు భయపడి ఆయనతో టీడీపీయే కాళ్ల బేరానికి వచ్చి పార్టీలో చేర్చుకున్నారా?. లేక అమరావతిలో మీకూ భాగస్వామ్యం కల్పిస్తామని, మనంమనం కలిసి ఎదుగుదామని నెహ్రును బుజ్జగించి పార్టీలోకి చేర్చుకున్నారా? అన్నదే ప్రశ్న. అయితే చంద్రబాబుకు అమరావతి భూముల అంశం బలహీనతగా ఉంటే… దేవినేని నెహ్రుకు తన కొడుకు రాజకీయ జీవితాన్ని నిలబెట్టాలనే బలహీనత ఉందంటున్నారు. అందుకే చెరో మెట్టు దిగి చంద్రబాబు, దేవినేని నెహ్రు చేతులు కలిపారంటున్నారు. మొత్తం మీద లోకేష్‌ రెండు లక్షల కోట్ల అవినీతి చేశారంటూ తాను చేసిన వ్యాఖ్యలను దేవినేని నెహ్రుయే ఎలా కౌంటర్ ఇచ్చుకుంటున్నారో!.

Click on Image to Read:

polavaram-chandrababu-naidu

uma-reddy-venkateswarlu

jaleel-khan

devineni-nehru

andhra-pradesh-capital-city

First Published:  16 Sep 2016 1:13 AM GMT
Next Story