Telugu Global
Cinema & Entertainment

"నిర్మలా కాన్వెంట్‌" సినిమా రివ్యూ

రివ్యూ: నిర్మలా కాన్వెంట్‌ రేటింగ్‌: 2.25/5 తారాగణం: రోషన్, శ్రీయాశర్మ, నాగార్జున, ఎల్ బి. శ్రీరాం తదితరులు సంగీతం: రోషన్ సాలూరి నిర్మాత:  అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ దర్శకత్వం: జి. నాగకోటేశ్వర రావు ప్రపంచంలో ప్రేమ కథలన్నీ ఒక్కలాగే ఉంటాయి. కులం, మతం, డబ్బు ఇలా ఏదో ఒకటి ప్రేమికులకు అడ్డుతగులుతూ ఉంటుంది. రోమియో జూలియట్‌కి పగ అడ్డుతగిలింది. అనార్కలికి అంతస్తు అడ్డుతగిలింది. ప్రేమ సంఘర్షణలో కొందరు చనిపోతారు. కొందరు గెలుస్తారు. అమర ప్రేమికులకీ జనం బ్రహ్మరధం పడతారు. గెలిచినవారికి జేజేలు పలుకుతారు. వాళ్ళకి […]

నిర్మలా కాన్వెంట్‌ సినిమా రివ్యూ
X

రివ్యూ: నిర్మలా కాన్వెంట్‌
రేటింగ్‌: 2.25/5
తారాగణం: రోషన్, శ్రీయాశర్మ, నాగార్జున, ఎల్ బి. శ్రీరాం తదితరులు
సంగీతం: రోషన్ సాలూరి
నిర్మాత: అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్
దర్శకత్వం: జి. నాగకోటేశ్వర రావు

ప్రపంచంలో ప్రేమ కథలన్నీ ఒక్కలాగే ఉంటాయి. కులం, మతం, డబ్బు ఇలా ఏదో ఒకటి ప్రేమికులకు అడ్డుతగులుతూ ఉంటుంది. రోమియో జూలియట్‌కి పగ అడ్డుతగిలింది. అనార్కలికి అంతస్తు అడ్డుతగిలింది. ప్రేమ సంఘర్షణలో కొందరు చనిపోతారు. కొందరు గెలుస్తారు. అమర ప్రేమికులకీ జనం బ్రహ్మరధం పడతారు. గెలిచినవారికి జేజేలు పలుకుతారు. వాళ్ళకి నచ్చాలంతే.

సినిమా పుట్టినప్పటినుంచి కొన్ని వేల ప్రేమకథలొచ్చాయి. అందులో కొన్ని మాత్రమే గుర్తుంటాయి. మిగతావన్నీ కాలంలో కలిసిపోతాయి. తెలుగులో టీనేజ్‌ లవ్‌స్టోరీలకి డిమాండ్‌ వుంది కానీ సప్లయిలేదు. సక్సెస్‌ రేట్‌ లేదు. సీతాకోకచిలుక తరువాత చాలాకాలానికి జయం వచ్చింది. నితిన్‌, సదా ఇద్దరూ నిలదొక్కుక్కున్నారు. ఆ తరువాత చాలా సినిమాలు వచ్చాయికానీ ఏవీ ఆడలేదు.

ప్రముఖ నటుడు శ్రీకాంత్‌, నటి ఊహల కుమారుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఇపుడు “నిర్మలా కాన్వెంట్‌” సినిమా వచ్చింది. కొత్తగా ఉంటుందని ఆశపడిన వారికి నిరాశమిగిలించింది. రొటీన్‌ కథతో కాసేపు టీవీ సీరియల్‌లా అనిపించింది. సెకెండాఫ్‌లో కథ కొంచెం స్పీడందుకుని ప్రేక్షకులని కాసేపు కూచోబెట్టింది. కాసేపైనా నాగార్జున లేకపోతే ఈ సినిమాని చూడడం కష్టమే.

కథ ప్రారంభమే 1970 నాటి సినిమాల్ని గుర్తు చేసింది. ఒక జమిందారుకి చిన్నరైతుకి మధ్య ఎకరం పొలంకోసం ఘర్షణ. ఈ గొడవలో హీరో తాత ఎల్‌బి. శ్రీరాం చనిపోతాడు. హీరోయిన్‌ తాత గెలుస్తాడు. కట్‌చేస్తే ఆ ఊరి రాజుగారి అమ్మాయి శ్రీయాశర్మ ఎకరం రైతు కొడుకు హీరో రోషన్‌ ఒకే కాన్వెంట్లో చదువుతూవుంటాడు. దానిపేరు నిర్మలా కాన్వెంట్‌. ఇంతకుమించి ఆ కాన్వెంట్‌కి సినిమాకి ఇంకే సంబంధంలేదు.

హీరో చాలా తెలివైనవాడు. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్‌. హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. ఇద్దరిమధ్య అంతస్తుల అంతరం. మతం కూడా అడ్డేకానీ ఆ విషయం ఎక్కడా చర్చకు రాకపోవడం సంతోషం. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. హీరోయిన్‌ తండ్రికి విషయం తెలిసి హీరోపైన దాడి చేయిస్తాడు. రాజుగారి అమ్మాయితో తనకి పెళ్ళి చేయమని తండ్రి సూర్యని గాయపడిన హీరో కోరతాడు. తాగుబోతు రమేష్‌లాంటి వాళ్ళని వెంటేసుకుని కోటలో వున్న రాజావారి వద్దకు పెళ్ళి సంబంధం మాట్లాడ్డానికి సూర్యవెళ్ళి అవమానం పాలవుతాడు. కొడుకు ప్రేమకోసం తనకున్న ఎకరం పొలాన్ని రాసిస్తాడు. డబ్బులేని నీ కొడుకు నా కూతుర్ని ఎలా పోషిస్తాడని విలన్‌ ప్రశ్నించడంతో ఇంటర్వెల్‌.

సెకండాఫ్‌లో హీరో ఇల్లు వదిలి హైదరాబాద్‌ చేరుతాడు. అక్కడ హీరో నాగార్జునని కలుసుకుని మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్‌షోలో అవకాశం ఇవ్వమని కోరతాడు. హీరో తెలివికి ఆశ్చర్యపోయిన నాగార్జున అతనికి అవకాశం కల్పిస్తాడు. హీరో సొంత ఊళ్ళో గేమ్‌ షో జరుగుతుంది. హీరో గెలుస్తాడు. గెలిచిన రెండుకోట్లు విలన్‌ ముందు పడేసి తనకి, హీరోయిన్‌కి ఇంకా పెళ్ళి వయసు రాలేదు కాబట్టి వయసు వచ్చిన తరువాత వచ్చి పెళ్ళి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. శుభం కార్డు పడుతుంది.

సినిమా ఎలా ఉన్నా హీరో రోషన్‌ చూడ ముచ్చటగా ఉన్నాడు. కొన్ని సన్నివేశాల్లో బాగా నటించాడు. కొన్ని చోట్ల తేలిపోయాడు. హీరోయిన్‌ శ్రీయాశర్మ గ్లామరస్‌గా ఉంది. మిగతా వాళ్ళెవరికీ ప్రాముఖ్యత లేదు. సెకెండాఫ్‌లో కథని నాగార్జున టేకోవర్‌ చేస్తాడు కాబట్టి స్మూత్‌గా సాగింది.

మొత్తం మీద దర్శకుడు పాతకథకి గేమ్‌షోని యాడ్‌ చేసి నడిపించాడు. ఫొటోగ్రఫి బావున్నా టేకింగ్‌లో వేగంలేదు. ఫస్టాఫ్‌ చూస్తే 1980 నాటి సినిమాని చూస్తున్నామా అనే సందేహం వస్తుంది. పాటలు బావున్నాయి. కొంచెం కూడా కామిక్‌ రిలీఫ్‌ లేకపోవడం, లవ్‌ సీన్స్‌ పండకపోవడం ఈ సినిమా లోపం. ఓపిక ఉంటే ఒకసారి చూడొచ్చు.

– జి.ఆర్‌. మహర్షి

First Published:  16 Sep 2016 3:41 AM GMT
Next Story