Telugu Global
NEWS

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత అరెస్ట్‌... కళా వెంకట్రావ్‌ కుట్ర అంటున్న నిందితుడు

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత, ఎంవీవీ బిల్డర్స్ అధినేత ఎంవీవీ సత్యనారాయణ అరెస్ట్ అయ్యారు. విశాఖ జిల్లా పీఎంపాలెం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. విశాఖ క్రికెట్ స్టేడియంకు ఎదురుగా ఉన్న మధురవాడలో ఉత్తరాంధ్రకు చెందిన 88 మంది స్థలాలు కొనుగోలు చేశారు. వారిలో 38 మంది నుంచి స్థలాలు కొనుగోలు చేసిన ఎంవీవీ సత్యనారాయణ… విశాఖ సిటీ పేరుతో గృహనిర్మాణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. భారీగా పబ్లిసిటీ కూడా ఇచ్చారు. అయితే ప్రాజెక్ట్‌ నిర్మాణం సమయంలో ఇతరుల స్థలాలను […]

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత అరెస్ట్‌... కళా వెంకట్రావ్‌ కుట్ర అంటున్న నిందితుడు
X

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత, ఎంవీవీ బిల్డర్స్ అధినేత ఎంవీవీ సత్యనారాయణ అరెస్ట్ అయ్యారు. విశాఖ జిల్లా పీఎంపాలెం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. విశాఖ క్రికెట్ స్టేడియంకు ఎదురుగా ఉన్న మధురవాడలో ఉత్తరాంధ్రకు చెందిన 88 మంది స్థలాలు కొనుగోలు చేశారు. వారిలో 38 మంది నుంచి స్థలాలు కొనుగోలు చేసిన ఎంవీవీ సత్యనారాయణ… విశాఖ సిటీ పేరుతో గృహనిర్మాణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. భారీగా పబ్లిసిటీ కూడా ఇచ్చారు. అయితే ప్రాజెక్ట్‌ నిర్మాణం సమయంలో ఇతరుల స్థలాలను కూడా ఎంవీవీ ఆక్రమించారన్నది ఆరోపణ. దీనిపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంవీవీ సత్యనారాయణ మాత్రం తానే తప్పు చేయలేదని చెబుతున్నారు. టీడీపీ నాయకుడు కళా వెంక్రటావు, ఆయన కుటుంబసభ్యులు కలిసి కుట్రపూరితంగా తనను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. నిబంధనల ప్రకారమే తాను విశాఖ సిటీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించానని చెప్పారు. అయితే అరెస్ట్ అయిన ఎంవీవీ సత్యనారాయణ తనకు గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో పోలీసులు అతడిని కేజీహెచ్‌కు తరలించారు.

Click on Image to Read:

uma-reddy-venkateswarlu

geetha-scams

chittoor-mayor-katari-anuradha

First Published:  17 Sep 2016 4:18 AM GMT
Next Story