Telugu Global
NEWS

అలా అయితే అది హెరిటేజ్ సొమ్మే అయి ఉండాలి...

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దులకు ఏదో మహిమ ఉన్నట్టు ఉంది. నేతలు ఏపీకి వెళ్తే ఒకలా, తెలంగాణకు వస్తే మరోలా మాట్లాడేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు బెస్ట్ ట్రాక్ రికార్డు చంద్రబాబే. వరంగల్‌ వెళ్లి నా లేఖ వల్లే తెలంగాణ వచ్చిందంటారు… ఏపీకి వచ్చి అన్యాయంగా ఏకపక్షంగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారు తమ్ముళ్లూ అంటూ వాపోతారు. చంద్రబాబు తీరు చూసి చూసి జనం కూడా అలవాటు పడ్డారు. అయితే శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ […]

అలా అయితే అది హెరిటేజ్ సొమ్మే అయి ఉండాలి...
X

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దులకు ఏదో మహిమ ఉన్నట్టు ఉంది. నేతలు ఏపీకి వెళ్తే ఒకలా, తెలంగాణకు వస్తే మరోలా మాట్లాడేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు బెస్ట్ ట్రాక్ రికార్డు చంద్రబాబే. వరంగల్‌ వెళ్లి నా లేఖ వల్లే తెలంగాణ వచ్చిందంటారు… ఏపీకి వచ్చి అన్యాయంగా ఏకపక్షంగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారు తమ్ముళ్లూ అంటూ వాపోతారు. చంద్రబాబు తీరు చూసి చూసి జనం కూడా అలవాటు పడ్డారు. అయితే శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు రాజకీయాలపై మాట్లాడిన ఆయన… కేసీఆర్‌ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆందోళన చెందారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలంతా ఊరకే వెళ్తారా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన డబ్బులను కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అమిత్ షా చెప్పింది వంద శాతం నిజం. సిద్దాంతాలు నచ్చి పార్టీ మారుతున్నామని ఏ ప్రజాప్రతినిధి అయినా అన్నారంటే అంతకు మించిన అబద్దం ఉండదు. పార్టీ మారుతున్న నేతలంతా ఏదో ఒక రూపంలో అమ్ముడుపోతున్న వారే. అయితే అమిత్ షాకు తెలంగాణలో ఫిరాయింపులు మాత్రమే కనిపిస్తున్నాయా?. చిరకాల మిత్రుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నది ఏమిటో?. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షమే లేకుండా చేస్తానని బహిరంగసభల్లో చెప్పి మరీ 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనేస్తే బీజేపీ నాయకత్వం ఎందుకు మాట్లాడలేదో?. సరే మిత్రుడు కాబట్టి బహిరంగవేదికల్లో చంద్రబాబును విమర్శించడం సరైన పద్దతి కాదు.

కానీ హోదా సాధించేందుకంటూ 33 సార్లు ఢిల్లీ వచ్చిన చంద్రబాబును నాలుగు గోడల మధ్యకు పిలుచుకుని అలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సలహా ఇచ్చి ఉండవచ్చు కదా!. సరే కేంద్రం పంపిన నిధుల సాయంతో ఎమ్మెల్యేలను కొనే అవకాశం కేసీఆర్‌కు వచ్చింది. మరి ఉదయం లేస్తే బీద అరుపులు అరిచే టీడీపీ ప్రభుత్వానికి 20 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను కొనుగోలు చేసేంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో అమిత్ షా ఆరా తీశారా?. ఒకవేళ అమిత్ షా ఆరా తీసినా అదంతా తన కుటుంబసభ్యులు కష్టపడి హెరిటేజ్‌లో సంపాదించిన సొమ్ము అని చంద్రబాబు నమ్మించగలరు. మొత్తం మీద తమది భారతదేశమంతా విశాలమైన జాతీయ దృక్పతం ఉన్న పార్టీ అని చెప్పుకునే బీజేపీ పెద్దలు కనీసం ఫిరాయింపు రాజకీయాల విషయంలోనైనా దేశాన్ని ఒక యూనిట్‌గా చూస్తే బాగుంటుంది. వైరిపక్షం చేస్తే వ్యభిచారం, మిత్రపక్షం చేస్తే శృంగారం అన్న పాత సిద్ధాంతానికి ముగింపు పలికితే బాగుంటుంది.

Click on Image to Read:

jayaprada

chandrbabu-and-lokesh-teachers-union

abk-prasad

First Published:  18 Sep 2016 1:52 AM GMT
Next Story