నాకే నచ్చలేదు, ఎందుకు కొనుక్కున్నారో – అవసరాల శ్రీనివాస్

డైరెక్టర్ & యాక్టర్ అవసరాల శ్రీనివాస్ తీసినవి రెండే సినిమాలు. కానీ అతని రెండు చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించి అతడికి హాట్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘జ్యో అచ్యుతానంద’ సినిమా విషయానికి వస్తే… సినిమా విడుదలకు ముందు చూసిన వారికి ఎవరికీ నచ్చలేదట. అంతెందుకు తనకు కూడా ఆ స్క్రిప్ట్‌లో లోపాలు ఉన్నాయి అని అర్థం అయిందట. ఈ సినిమా ఎవరూ కొనరనుకున్నాడట. కాని బిజినెస్ సమయంలో సినిమాను చూసి.. వెంటనే కొన్నుక్కున్న వారిని చూసి ఆశ్చర్యం అనిపించిందట. తన ‘ఊహలు గుస గుసలాడే’ సినిమా స్క్రిప్ట్ పక్కాగా ఉందని.. ఎవరు క్రిటిసైజ్ చేసినా తాను సమర్దించుకోగలనని.. కాని ‘జ్యో అచ్యుతానంద’ విషయంలో అలా చేయలేను అని అంటునాడు అవసరాల.