Telugu Global
Cinema & Entertainment

వర్మ ట్వీట్ పై హైకోర్టు అనుమానాలు

సెన్సేషన్ అంటే RGV తర్వాతే ఎవరైనా అనాలి. 2014 లో వినాయక చవితి రోజు గణేషుడిపై కొన్ని ట్వీట్స్ చేసాడు. అవి వినాయకుడిని పూజించేవారి సెంటిమెంట్స్‌ని గాయపరిచేవిగా ఉన్నాయని ఆన్‌లైన్‌లో ఒక యుద్ధమే జరిగింది. ఒక అడ్వకేట్ కి చిర్రెత్తుకొచ్చి, RGV పై కోర్టులో కేసు వేసాడు. అది ఇప్పుడు మధ్య ప్రదేశ్ హైకోర్టు హియరింగ్ కి వచ్చింది. RGV ట్వీట్స్ దోషపూరిత నేరం కిందకి వస్తాయా లేదా తెలుసుకొమ్మని పోలీసులకు హైకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. […]

వర్మ ట్వీట్ పై హైకోర్టు అనుమానాలు
X
సెన్సేషన్ అంటే RGV తర్వాతే ఎవరైనా అనాలి. 2014 లో వినాయక చవితి రోజు గణేషుడిపై కొన్ని ట్వీట్స్ చేసాడు. అవి వినాయకుడిని పూజించేవారి సెంటిమెంట్స్‌ని గాయపరిచేవిగా ఉన్నాయని ఆన్‌లైన్‌లో ఒక యుద్ధమే జరిగింది. ఒక అడ్వకేట్ కి చిర్రెత్తుకొచ్చి, RGV పై కోర్టులో కేసు వేసాడు. అది ఇప్పుడు మధ్య ప్రదేశ్ హైకోర్టు హియరింగ్ కి వచ్చింది. RGV ట్వీట్స్ దోషపూరిత నేరం కిందకి వస్తాయా లేదా తెలుసుకొమ్మని పోలీసులకు హైకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. ఆ ట్వీట్స్‌లో RGV వినాయకుడిపై కొన్ని సందేహాలు వ్యక్తం చేసాడు. ‘వినాయకుడు చేతులతో తింటాడా? తొండంతో తింటాడా?’ ‘వినాయకుడికి పొట్ట బాల్యం నుండే ఉందా? తొండం అతికించే ప్రక్రియతో వస్తుందా?’ ‘తన తలనే కాపాడుకోలేని వాడు.. మిమ్మల్ని ఏమి కాపాడుతాడు?’ ఇలా అనేక ట్వీట్స్ పెట్టాడు. మరి మీ దృష్టిలో RGV నేరం చేసినట్లేనా? మీరేమంటారు?.
First Published:  18 Sep 2016 7:14 AM GMT
Next Story