నా అస్సలు కథ ఎవ్వరికీ చెప్పను

 బాలివుడ్‌లో అత్యంత ప్రతిభావంతురాలయిన నటిగా కంగనా రనౌత్ రెండుసార్లు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ తీసుకోవడం అందరికీ గర్వ కారణమే. కాని ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం అంతా గ్లామరస్ కాదు. బాలివుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో ఆమె రిలేషన్‌షిప్ గురించిన వార్తలు చాలా అగ్లీ మలుపు తీసుకుని రచ్చ రచ్చ అయ్యింది. ఇదే విషయం గురించి ఇటీవల జరిగిన ‘ఇండియా టుడే మైండ్ రాక్స్ యూత్ సమ్మిట్’ లో మాట్లాడుతూ… నాతో రిలేషన్‌షిప్ గురించి సిగ్గు పడేవారి కోసం, లేదా సాక్ష్యం కోసమో నేను స్పర్మ్ ఉన్న ప్యాంటీస్ లేదా తను ఇచ్చిన గిఫ్ట్స్ దాచుకోనక్కరలేదు. అసలు నా కథ ఎవరికీ చెప్పాలనుకోవడం లేదు.. ఎందుకంటే… మీరు అనుకున్నట్లు అది ఏడుపుగొట్టు కథ కాదు. నాకు నా సమస్యలను ఎదుర్కునే సామర్థ్యం ఉంది.. అని గట్టిగా చెప్పింది. హ్యాట్స్ ఆఫ్ కంగనా.