వాట్ ఏ బ్యూటీ…. లొట్టలేసుకున్నాడు….

మన దేశంలో వృత్తికి వృత్తికి విలువల లెక్కింపులో తేడాలు కనిపిస్తుంటాయి. ఒక రాజకీయ నాయకుడు తన తోటి నాయకురాలిని “వాట్‌ ఏ బ్యూటీ అని బహిరంగంగా పొగిడే అవకాశం ఉంటుందా?. ఆమె కనిపిస్తే లొట్టలేసుకుంటా అని అనే వీలుంటుందా?”. ఉండదు. ఒక రాజకీయ నాయకుడు ఒక మహిళ పట్ల అలా మాట్లాడితే తెల్లారే సరికి అతడి రాజకీయ జీవితం తెల్లారినట్టే. అయితే సినిమావాళ్లకు మాత్రం ఆ విషయంలో కాస్త వెసులుబాటు ఉంటుంది. మనసార మనసులోని ఫీలింగ్స్‌ బయటపెట్టుకోవచ్చు. అదేంటి అంటే సినిమావాళ్లు కదండీ ఆ మాత్రం రొమాటింక్ కామెంట్స్‌ కామన్‌ అని సరిపుచ్చుకుంటుంది సమాజం. ప్రముఖ నటుడు మోహన్‌బాబు 40ఏళ్ల సినీ ప్రస్తాన సన్మాన కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మోహన్‌బాబులోని ఫీలింగ్స్ కాసేపు తన్నుకొచ్చాయి.

జయపద్రను చూసి వాట్‌ ఏ బ్యూటీ అంటూ పొగిడారు. ఇప్పటి జనరేషన్లో చాలా మంది హీరోయిన్లు వస్తున్నా జయప్రద మాత్రం వాట్‌ ఏ బ్యూటీ అన్నారు. ”నా భర్య ఉంది గానీ లేకపోతే తాను అప్పుడప్పుడు జయప్రదను చూసి లొట్టలేసుకుంటా” అని వ్యాఖ్యానించారు. జయప్రదతో హీరోగా, విలన్‌గా కూడా తాను చేశానని గుర్తు చేసుకున్నారు. మోహన్‌బాబు వ్యాఖ్యలకు అంతా నవ్వుకున్నారు. జయప్రద కూడా నవ్వుకుని హ్వాపీగా ఫీల్ అయ్యారు. మోహన్‌బాబు.. జయప్రదను చూసి లొట్టలేసుకుంటా అన్న మాటలకు ఆయన సతీమణి కూడా నవ్వారు. సినిమా వాళ్లకు ఉన్న అడ్వాంటేజ్ అదే కదా!.

Click on Image to Read:

chandrbabu-and-lokesh-teachers-union

abk-prasad

venkaiah-naidu