కేసులకు భయపడం… ప్రజల ప్రయోజనాలే ముఖ్యం

ప్ర్తత్యేక ప్యాకేజ్‌ పేరుతో చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి ప్రజలను మోసం చేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇతర రాష్ట్రాల తరహాలోనే ఏపీకి సాయం చేశారని.. అందులో అదనంగా ఇచ్చింది ఏమీ లేదన్నరు.  కేసులకు భయపడేది లేదన్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా కావాలన్న వెంకయ్యనాయుడు ఇప్పుడు ఎందుకు అభిప్రాయం మార్చుకున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. వెంకయ్య అభిప్రాయాన్ని చంద్రబాబు మార్చారా అని ప్రశ్నించారు. అసలు వెంకయ్యనాయుడు ఎందుకు సన్మానాలు చేయించుకుంటున్నారని  విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు ద్రోహం చేసినందుకా, లేక ప్రత్యేక హోదాపై అబద్దాలు చెబుతున్నందుకా అని నిలదీశారు. ఏపీకి రూ. 2 లక్షల 25 వేల కోట్లు ఇస్తున్నామని కేంద్రం చెబుతోందని అయితే ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు చెప్పాలన్నారు.

Click on Image to Read:

jc-diwakar-reddy

vallabhaneni-vamsi