బామ్మర్ధికేనా… భూమా కోసం ఆ మాత్రం చేయరా?

ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ నేతలపై ఉన్న కేసులను ఎత్తివేసే కార్యక్రమం మొదలుపెట్టింది. కొద్ది రోజుల క్రితమే స్పీకర్ కోడెల శివప్రసాదరావు, బామ్మర్ధి బాలకృష్ణపై ఎన్నికల సమయంలో నమోదైన కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. వారిని చూసి ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూడా చంద్రబాబుకు దరఖాస్తు పెట్టుకున్నారు. రౌడీ షీటర్‌గా ఉన్న భూమా తనపై రౌడీషీట్‌ను ఎత్తివేయాలని స్వయంగా సీఎంను కలిసి విజ్ఞప్తి చేసినట్టు చెబుతున్నారు. భూమా విజ్ఞప్తి నేపథ్యంలో రౌడీ షీట్‌ ఎత్తివేతపై నివేదిక ఇవ్వాలని జిల్లా పోలీసులను చంద్రబాబు ఆదేశించారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే భూమానాగిరెడ్డిపై రౌడీ షీట్ తెరిచిందే చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే భూమాపై రౌడీ షీట్ తెరిచారు.

2014 అక్టోబర్ 31న నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించగా… భూమా మాట్లాడుతున్న సమయంలో చైర్‌పర్సన్ ఇక చాలించాలంటూ బెల్ కొట్టారు. దీంతో భూమా ఆగ్రహానికి లోనయ్యారు. టీడీపీ కౌన్సిలర్లకు, భూమా వర్గీయులకు మధ్య గొడవ జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ విజయకుమార్‌పై హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం వెనుక భూమా హస్తముందని స్వయంగా టీడీపీ నేతలే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేవారు. భూమాపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. అనంతరం పోలీసులు భూమానాగిరెడ్డిపై రౌడీ షీట్ తెరిచారు. ఇప్పుడు ఆ రౌడీషీట్‌ను ఎత్తివేసేందుకు తిరిగి టీడీపీ ప్రభుత్వమే సిద్దమవుతోంది. ఈ పరిణామంపై కర్నూలు జిల్లా టీడీపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు రౌడీగా కనిపించిన భూమా… టీడీపీలోకి రాగానే సాధుజీవి అయిపోతారా అని ప్రశ్నిస్తున్నారు. భూమాపై రౌడీ షీట్ ఎత్తివేస్తే చంద్రబాబు పాలన వివక్షపూరితమైనదన్న అభిప్రాయం మరింత బలపడుతుందంటున్నారు. తప్పదు మరి. కోడెల శివప్రసాదరావు, బామ్మర్ధి బాలకృష్ణపై మాత్రమే కేసులు ఎత్తివేసి ఊరుకుంటే చంద్రబాబుకు కొందరి మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఎక్కువ అన్న విమర్శలు వచ్చే చాన్స్ ఉంది.

Click on Image to Read:

unadvalli-arun-kumar

jc-diwakar-reddy

vallabhaneni-vamsi