Telugu Global
NEWS

టీడీపీ స్థానంపై క‌మ‌ల‌నాథుల‌ గురి?

స్నేహం చేయి.. విస్త‌రించు..ఆక్ర‌మించు.. ఇది ఉత్త‌ర‌భార‌త‌ వ్యాపారుల సూత్రం. వారు దీన్ని తెల్ల‌వారి నుంచి నేర్చుకున్నారు. స‌రిగ్గా ఇదే సూత్రాన్ని బీజేపీ దేశంలో త‌న పార్టీని విస్త‌రించేందుకు అనుస‌రిస్తోంది. తెలంగాణ‌లోనూ ఇదే సిద్ధాంతం ప్ర‌కారం ముందుకు వెళుతోంది.  తెలుగుదేశం తెలంగాణ‌లో క‌నుమ‌రుగవుతున్న ప్ర‌భ‌ను త‌మ ఖాతాలో వేసుకునేందుకు పావులు క‌దుపుతోంది. ఈ సూత్రం మ‌హారాష్ట్ర విష‌యంలో నిజ‌మైంది కూడా. నిన్న మొన్న‌టి దాకా శివ‌సేన‌కు తోక‌పార్టీలా ఉన్న బీజేపీ ఇప్పుడు శివ‌సేన‌నే తోక‌లా మార్చుకుంది. దీనికి మోదీ […]

టీడీపీ స్థానంపై క‌మ‌ల‌నాథుల‌ గురి?
X
స్నేహం చేయి.. విస్త‌రించు..ఆక్ర‌మించు.. ఇది ఉత్త‌ర‌భార‌త‌ వ్యాపారుల సూత్రం. వారు దీన్ని తెల్ల‌వారి నుంచి నేర్చుకున్నారు. స‌రిగ్గా ఇదే సూత్రాన్ని బీజేపీ దేశంలో త‌న పార్టీని విస్త‌రించేందుకు అనుస‌రిస్తోంది. తెలంగాణ‌లోనూ ఇదే సిద్ధాంతం ప్ర‌కారం ముందుకు వెళుతోంది. తెలుగుదేశం తెలంగాణ‌లో క‌నుమ‌రుగవుతున్న ప్ర‌భ‌ను త‌మ ఖాతాలో వేసుకునేందుకు పావులు క‌దుపుతోంది. ఈ సూత్రం మ‌హారాష్ట్ర విష‌యంలో నిజ‌మైంది కూడా. నిన్న మొన్న‌టి దాకా శివ‌సేన‌కు తోక‌పార్టీలా ఉన్న బీజేపీ ఇప్పుడు శివ‌సేన‌నే తోక‌లా మార్చుకుంది. దీనికి మోదీ మేనియా అస‌లు కార‌ణం. అయితే, ఈ ఫార్ములా అన్ని చోట్లా స‌క్సెస్ కాలేదు. కానీ, పార్టీ విస్త‌ర‌ణ‌కు మాత్రం బాగానే దోహ‌ద‌ప‌డుతోంది. చాలాకాలంగా బీజేపీకి క‌ర్నాట‌క‌, తెలంగాణ మిన‌హా ద‌క్షిణ భార‌త‌దేశంలో ఇత‌ర రాష్ర్టాల్లో చాలాకాలంగా అడుగుపెడ‌దామ‌నుకుంటున్నా.. ఆ ప్ర‌య‌త్నాలు అంత‌గా స‌ఫ‌లం కాలేక‌పోయాయి.
అందుకే, కాస్తో కూస్తో బ‌ల‌మున్న తెలంగాణ‌లో ఇంత‌కాలం టీడీపీ చేయూత‌తో గెలుస్తోంది. అయితే, ఇలా ఎంత‌కాలం? ఎన్నిరోజులని టీడీపీ చేయి ప‌ట్టుకుని న‌డ‌వాలి? ఓటుకు నోటు కేసు, పార్టీ ఫిరాయింపులు, అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో తెలుగుదేశంపార్టీ కొట్టుమిట్టాడుతోంది. మ‌న‌కంటూ బ‌లం పుంజుకోవాల్సిన స‌మ‌య‌మిదేన‌ని బీజేపీ భావిస్తోంది. మిత్రుని మించిన బ‌లం కూడ‌గ‌ట్టుకోవాలంటే ఇంత‌కంటే మంచి స‌మ‌యం దొర‌క‌దు. పైగా కేంద్రంలో త‌మ పార్టే అధికారంలో ఉంది. అందుకే, సెప్టెంబ‌రు 17 తేదీని తెలంగాణ‌ విమోచ‌నం అధికారికంగా జ‌ర‌పాలంటూ మొన్న‌టిదాకా హ‌డావుడి చేశారు. తెలుగుదేశం స్త‌బ్దుగా ఉంటున్న ఈ స‌మయాన్ని స‌ద్వినియోగం చేసుకుంటే.. త‌మ పార్టీ శ్రేణులను బ‌లోపేతం చేసుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న‌తో ఉంది. ఈ క్ర‌మంలో హిందూ-ముస్లింల మ‌ధ్య చిచ్చుపెడుతున్నార‌న్న విమ‌ర్శ‌ల‌ను ఏమాత్ర ప‌ట్టించుకోకుండా మొండిగా ముందుకుపోతోంది. త‌మ ఓట్ల‌తో గెలిపించుకున్న బీజేపీ.. త‌మ నెత్తిపైనే చేయిపెట్టేందుకు చేస్తోన్న ప్ర‌య‌త్నాలను టీడీపీ గ‌మ‌నిస్తోందా.. లేక తెలిసీ ఊరుకుంటుందా? అన్న‌ది అనుమానంగా మారింది.

Click on Image to Read:

unadvalli-arun-kumar

jc-diwakar-reddy

vallabhaneni-vamsi

First Published:  18 Sep 2016 4:01 PM GMT
Next Story