Telugu Global
NEWS

లేటెస్ట్ షాక్ " చంద్రబాబుకు గట్టి షాక్‌ ఇచ్చిన కేంద్రం

చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ప్రతి విషయంలోనూ అండగా ఉంటూ చేయి పట్టుకుని నడిపిస్తామని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన ఢిల్లీ పెద్దలు… తాజాగా అమరావతి అప్పు విషయంలో ఊహించని పని చేసింది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్‌ తెచ్చుకోవాలనుకుంటున్న అప్పు మొత్తాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ సగానికి సగం కట్ చేసింది. అమరావతి నిర్మాణం కోసం ఒక బిలియన్ (100 కోట్లు) అమెరికా […]

లేటెస్ట్ షాక్  చంద్రబాబుకు గట్టి షాక్‌ ఇచ్చిన కేంద్రం
X

చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ప్రతి విషయంలోనూ అండగా ఉంటూ చేయి పట్టుకుని నడిపిస్తామని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన ఢిల్లీ పెద్దలు… తాజాగా అమరావతి అప్పు విషయంలో ఊహించని పని చేసింది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్‌ తెచ్చుకోవాలనుకుంటున్న అప్పు మొత్తాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ సగానికి సగం కట్ చేసింది. అమరావతి నిర్మాణం కోసం ఒక బిలియన్ (100 కోట్లు) అమెరికా డాలర్ల రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మార్చిలో అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ రుణ మొత్తాన్ని ఆర్థిక శాఖ సగానికి తగ్గించింది. అమరావతి నిర్మాణం కోసం కేవలం 500 మిలియన్ (50 కోట్లు) డాలర్ల రుణం మాత్రమే ఇవ్వాలని ప్రపంచబ్యాంకుకు భారత ప్రభుత్వం తెలియజేసినట్టు జాతీయ మీడియా కథనాలు నిర్ధారించాయి.

కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, ప్రపంచ బ్యాంకు అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారని నేషనల్ మీడియా వెల్లడించింది. మరో విషయం ఏమిటంటే అప్పు ఇచ్చే విషయంలో ఇప్పటికీ ప్రపంచ బ్యాంకు నిర్ణయం తీసుకోలేదు. ప్రపంచ బ్యాంక్ ఇంకా రుణ మొత్తానికి ఆమోదం తెలపాల్సి ఉంది. రుణ మంజూరులో జాప్యం చేసినా, ప్రతిపాదనను తిరస్కరించినా అమరావతి నిర్మాణ పనులు స్తంభించిపోతాయని అంటున్నారు. ప్రపంచ బ్యాంకు సంగతి పక్కన పెడితే ఏపీకి అన్ని విధాలుగా సాయం చేస్తున్నామని చెబుతున్న బీజేపీ పెద్దలు, ముఖ్యంగా ప్యాకేజ్‌ ప్రచారం పేరుతో లేటెస్ట్‌గా ఏపీలో తిరుగుతూ సన్మానాలు చేయించుకుంటున్న వెంకయ్యనాయుడు అమరావతి రుణ మొత్తాన్ని సగానికి తగ్గించడంపై ఏం చెబుతారో!. దీనికి కూడా ఏదో ఒక కథ సిద్ధం చేస్తారు కాబోలు.

Click on Image to Read:

abk-prasad

unadvalli-arun-kumar

ys-jagan

First Published:  19 Sep 2016 11:58 AM GMT
Next Story