పృథ్వీ వైసీపీ తరపున పోటీ చేస్తారా?

టాలీవుడ్‌లో బిజీ కమెడియన్‌గా పృథ్వీ హవా నడుస్తోంది. 30 ఇయర్ ఇండస్ట్రీ డైలాగ్‌తో పాపులర్ అయిపోయాడు. అయితే మొదట్లో తాను చాలా ఇబ్బందులుపడ్డానని పృథ్వీ చెప్పారు. పరిశ్రమలో అవసరం లేకున్నా సలామ్‌లు కొట్టలేక మూడుసార్లు వెనక్కు వెళ్లానని చెప్పారు. కానీ రావుగోపాల్‌రావు, ప్రభాకర్‌ రెడ్డిలు తనను ప్రోత్సహించారని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి బ్రేక్ వస్తుందో చెప్పడం కష్టమన్నారు. ప్రస్తుతం తనకు డిమాండ్‌ ఉంది కాబట్టి సినిమాకు ఇంతే ఇవ్వాలి, ఇంత సమయమే పనిచేస్తా అని బెట్టు చేసే వ్యక్తిని తాను కాదన్నారు. అలా చేస్తే అప్పటి నుంచి వీడిని ఎలా తొక్కివేయాలా అని అందరు కలిసి ప్లాన్ చేస్తారన్నారు.

యావరేజ్ లైఫ్ ఆల్‌వేస్ సేఫ్ అని దాసరి నారాయణ చెప్పారని దాన్నే తాను ఫాలో అవుతున్నానన్నారు. వైఎస్ జగన్‌ ముఖ్యమంత్రి అయితే పృథ్వీని ఎమ్మెల్సీ చేస్తారంటూ చిత్రపరిశ్రమలో ప్రచారం జరిగిన మాట నిజమేనన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసింది కూడా నిజమేనని చెప్పారు. అయితే తమ మిత్రుడు, నిర్మాత వంశీకృష్ణ వైసీపీ తరపున పోటీ చేస్తుండడంతో ఆయన తరపున ప్రచారం చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట కదా అన్న ప్రశ్నకు అలాంటి ఆలోచన లేదని జగన్‌ అభిమాని కూడా అయిన పృథ్వీ చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవి అన్నీ సినిమాల్లో చేశానని ఆ విధంగానే తాను సంతోషిస్తానన్నారు. తాను పుట్టిన ప్రాంతాల్లో సేవ చేయాలని మాత్రం ఉందన్నారు. బాలకృష్ణ నటించిన సినిమా పాత్రను పేరిడి చేయడంపై కొందరు బాలకృష్ణ అభిమానులు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలని బెదిరించిన మాట వాస్తవమేనన్నారు. అయితే అనంతరం వారే తన పుట్టిన రోజు నాడు వచ్చి శుభాకాంక్షలు చెప్పారన్నారు.

Click on Image to Read:

unadvalli-arun-kumar

jc-diwakar-reddy

vallabhaneni-vamsi