సీఐడీతో మంచాల అలా చెప్పారా? ఆ పత్రికకు అంతా పక్కాగా తెలిసిందా!

తుని రైలు విధ్వంసం కేసులో సీఐడీ పలువురిని విచారిస్తోంది. ఇప్పటికే వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని ఒకసారి విచారించి మరోసారి నోటీసులు జారీ చేసిన సీఐడీ … తుని ఘటనలోనే కాపు సామాజికవర్గానికి చెందిన నెంబర్‌ వన్ న్యూస్‌ ఛానల్‌ యజమాని మంచాల సుధాకర్‌ నాయుడిని సోమవారం సీఐడీ విచారించింది. అయితే విచారణలో సుధాకర్‌ నాయుడు చెప్పారంటూ టీడీపీ అనుకూల మీడియా సంస్థ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఒకింత వైరాగ్యంతో సుధాకర్‌నాయుడు చేతులెత్తేశారన్నట్టుగా కథనం రాసింది. ముద్రగడే కాపు సభకు వచ్చిన వారిని రెచ్చగొట్టారని సుధాకర్‌నాయుడు చెప్పారట. సభావేదికపై ఒకరి తర్వాత మరొకరు మాట్లాడుదామని తొలుత చెప్పి… మొత్తం ముద్రగడే మాట్లాడేశారని ఆయన సీఐడీతో చెప్పినట్టు కథనం.

సభకు వచ్చినవారిని ముద్రగడే రైల్వే ట్రాక్‌ వైపు తీసుకెళ్లారని, రైల్‌రోకో చేయడం వల్లే అంతమంది గుమిగూడారని విచారణలో ఆయన చెప్పారట. తనకు ప్రమాదం జరిగితే చూసేందుకు ఒక్కరూ కూడా రాలేదని, ఇంకా కాపులకు ఏం న్యాయం చేస్తారని పరోక్షంగా కాపు నేతలను సుధాకర్‌నాయుడు తప్పుపట్టినట్టుగా టీడీపీ అనుకూల మీడియా సంస్థ చెప్పింది. కాపు సభలో వినియోగించిన డ్రోన్‌ కెమెరాలు హైదరాబాద్‌ నుంచి కొంతమంది సహకారంతో ముద్రగడ కుమారుడే తెప్పించారని విచారణ సందర్భంగా సుధాకర్ బయటపెట్టారని సదరు మీడియా రాసింది. సుధాకర్ నాయుడు చెప్పిన వివరాల మేరకు డ్రోన్ కెమెరాలను అందించిన వారికి కూడా సీఐడీ నోటీసులు జారీ చేయనుందని టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది. అయినా సీఐడీ విచారణలో సుధాకర్ నాయుడు చెప్పిన విషయాలు సదరు పత్రిక, ఛానల్‌కు ఎలా తెలిశాయో!.

Click on Image to Read:

jc-diwkar-reddy-mayor-swaroopa

kothapalli-geetha

unadvalli-arun-kumar