Telugu Global
Cinema & Entertainment

సినిమా రిలీజ్ కు ముందు అలా.... రిలీజ్ తర్వాత ఇలా..!

ఎంత చేసినా..ఏది చేసినా   విడుద‌ల‌కు ముందు  ఎంత ఊద‌ర గొట్టినా..   రిలీజ్ అయిన త‌రువాత  క‌థ ఆడియ‌న్స్  కు క‌నెక్ట్ అయితేనే   ఆ చిత్రం  విజ‌య‌తీరం చేరుతుంది. లేక పోతే  ఆదిలోనే   ప‌డిపోతుంది. ప్ర‌స్తుతం  నాగార్జున‌,  నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్  నిర్మించిన  నిర్మ‌లా కాన్వెంట్ చిత్రం   ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌లేక పోయింది.  నాగార్జున భుజాల‌కెత్తుకుని  సినిమాకు ప్ర‌చారం చేస్తుండ‌టంతో.. బ‌య్య‌ర్లు భారీ రేటు పెట్టి సినిమాను కొనుకున్నారు. అయితే  రిలీజ్ అయిన త‌రువాత   పెద్ద‌గా  బండి న‌డ‌వ‌క పోవ‌డంతో..   అంతా […]

సినిమా రిలీజ్ కు ముందు అలా.... రిలీజ్ తర్వాత ఇలా..!
X

ఎంత చేసినా..ఏది చేసినా విడుద‌ల‌కు ముందు ఎంత ఊద‌ర గొట్టినా.. రిలీజ్ అయిన త‌రువాత క‌థ ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అయితేనే ఆ చిత్రం విజ‌య‌తీరం చేరుతుంది. లేక పోతే ఆదిలోనే ప‌డిపోతుంది. ప్ర‌స్తుతం నాగార్జున‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ నిర్మించిన నిర్మ‌లా కాన్వెంట్ చిత్రం ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌లేక పోయింది. నాగార్జున భుజాల‌కెత్తుకుని సినిమాకు ప్ర‌చారం చేస్తుండ‌టంతో.. బ‌య్య‌ర్లు భారీ రేటు పెట్టి సినిమాను కొనుకున్నారు. అయితే రిలీజ్ అయిన త‌రువాత పెద్ద‌గా బండి న‌డ‌వ‌క పోవ‌డంతో.. అంతా సైలెంట్ అయ్యారు.

ఇప్పుడు పెట్టుబడిలో 20శాతం తిరిగి రావడం కూడా కష్టమనే అంచనాలు వస్తుండంతో.. నిర్మలా కాన్వెంట్ భారీ డిజాస్టర్ గా మిగిలిపోనుంది. విడుదల ముందువరకూ అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసిన నాగ్ కూడా.. ఇప్పుడు సైలెంట్ అయిపోవడం చూస్తే.. ఇకపై పుంజుకుంటుందనే హోప్స్ ను ఇప్పటికే వదిలేసుకున్నట్లు అర్ధమైపోతోంది. సెకండాఫ్ లో గేమ్ షోతో కాల‌క్షేపం చేయ‌డంతో సినిమాకు పెద్ద మైన‌స్ అయ్యింది.

First Published:  19 Sep 2016 1:01 AM GMT
Next Story