Telugu Global
Cinema & Entertainment

ద‌క్షిణాది స్టార్స్ కు స‌వాల్ విస‌రుతున్న డెబ్యూ హీరో..

మాజీ ప్ర‌ధాని దేవేగౌడ మ‌నువ‌డు నిఖిల్ గౌడ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ద‌ర్శ‌కుడు మ‌హాదేవ్ రూపొందించిన చిత్ర ‘జాగ్వార్‌’. సుమారు 75 కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నెల 18న హైద‌రాబాద్‌లో ఆడియో ఆవిష్క‌ర‌ణ జ‌రుపుకుంది, అక్టోబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ని విడుదల చేసారు.  మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు, […]

ద‌క్షిణాది  స్టార్స్ కు స‌వాల్ విస‌రుతున్న  డెబ్యూ హీరో..
X

మాజీ ప్ర‌ధాని దేవేగౌడ మ‌నువ‌డు నిఖిల్ గౌడ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ద‌ర్శ‌కుడు మ‌హాదేవ్ రూపొందించిన చిత్ర ‘జాగ్వార్‌’. సుమారు 75 కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నెల 18న హైద‌రాబాద్‌లో ఆడియో ఆవిష్క‌ర‌ణ జ‌రుపుకుంది, అక్టోబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ని విడుదల చేసారు. మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్నా ఓ ఐటమ్ సాంగ్‌లో కనిపించనుండడం ఈ సినిమాకు అంచనాలను పెంచింది.

ఇప్ప‌టికే ద‌స‌రా బ‌రిలో చాలా సినిమాలు రెడీగా ఉన్న నేప‌థ్యంలో ఈ సినిమాను కూడా అప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ భాషాభేదాలతో సంబంధం లేకుండా ప్రతిభను ప్రోత్సహించడంలో తెలుగు ప్రజలు ముందుంటారన్నారు. జాగ్వార్ ట్రైలర్, పాటల్లో నిఖిల్ పడిన కష్టం కనిపిస్తుందని పేర్కొన్నారు. తాతగారు దేవెగౌడ, అమ్మానాన్నల పేరును నిఖిల్ నిలబెట్టుతాడనే నమ్మకముందని తెలిపారు . ఒక డెబ్యూ హీరో సినిమాకు దాదాపు 75 కోట్లు బ‌డ్టెట్ పెట్ట‌డం అనేది ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రిలో బ‌హుశ ఇదే ప్ర‌థ‌మం. ట్రైల‌ర్స్ చూస్తుంటే.. బాలీవుడ్ లో వచ్చిన ధూమ్ చిత్రాల రేంజ్ క‌నిపిస్తుంది. మ‌రి ఒక డెబ్యూ హీరో ఈ రేంజ్ లో రావ‌డం అంటే నిజంగా మ‌న సౌత్ స్టార్ హీరోల‌కు స‌వాల్ విసిరిన‌ట్లే క‌దా.!

First Published:  19 Sep 2016 5:17 AM GMT
Next Story