Telugu Global
Cinema & Entertainment

మళ్లీ సినిమాలు చేస్తుందట...

సూపర్ సినిమాలో నటించిన ఆయేషా టకియా గుర్తుందా… తెల్లటి మేనిఛాయతో కుర్రాళ్లను పిచ్చెక్కించిన ఈ బ్యూటీ, అటు బాలీవుడ్ సల్మాన్ ఖాన్ కు కూడా పోకిరి రీమేక్ తో హిట్ ఇచ్చింది. ఆ తర్వాత సడెన్ గా పెళ్లి చేసుకొని వెండితెరకు దూరమైంది. ఏడేళ్ల కిందట ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకున్న ఆయేషా.. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం మరోసారి సినిమాలు చేయాలనుకుంటోంది ఆయేషా. అందుకే జిమ్ కు వెళ్లి బాడీని షేప్ లోకి తీసుకొచ్చింది. […]

మళ్లీ సినిమాలు చేస్తుందట...
X

సూపర్ సినిమాలో నటించిన ఆయేషా టకియా గుర్తుందా… తెల్లటి మేనిఛాయతో కుర్రాళ్లను పిచ్చెక్కించిన ఈ బ్యూటీ, అటు బాలీవుడ్ సల్మాన్ ఖాన్ కు కూడా పోకిరి రీమేక్ తో హిట్ ఇచ్చింది. ఆ తర్వాత సడెన్ గా పెళ్లి చేసుకొని వెండితెరకు దూరమైంది. ఏడేళ్ల కిందట ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకున్న ఆయేషా.. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం మరోసారి సినిమాలు చేయాలనుకుంటోంది ఆయేషా. అందుకే జిమ్ కు వెళ్లి బాడీని షేప్ లోకి తీసుకొచ్చింది. కాస్త సన్నబడే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు హెయిర్ స్టయిల్, లుక్ కూడా మార్చింది. అలా తయారైన ఫొటోను మొదట సోషల్ మీడియాలో పెట్టింది. కానీ పాపం.. ఎవరూ ఆయేషాను గుర్తుపట్టలేకపోయారు. దీంతో లాభం లేదని గ్రహించి… ఒకప్పటి పాత ఫొటోను, తాజా ఫొటోను కలిపి సోషల్ మీడియాలో పెట్టింది. ఈసారి మాత్రం జనాలు ఫుల్లుగా గుర్తుపట్టారు. ఎప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నావంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైకి వస్తానని అంటోంది ఆయేషా. ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే అలాఇలా నెట్టుకొచ్చిన ఈ భామకు… సెకెండ్ ఇన్నింగ్స్ కలిసొస్తుందా అనేది చాలామంది డౌట్.

First Published:  20 Sep 2016 2:36 AM GMT
Next Story