లోకేష్‌ వెయ్యి కోట్ల కుంభకోణాన్ని వారంలో బయటపెడుతా – వైసీపీ నేత

విశాఖలో మాఫియాల ఆగడాలకు ప్రజలు భయపడుతూ బతికే పరిస్థితి వచ్చిందని వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విశాఖలో పరిస్థితులపై ఒక ప్రముఖ టీవీ ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ నేత అమర్‌నాథ్, ద్రోణంరాజు శ్రీనివాస్‌, వామపక్ష నేత నర్సింగరావు పాల్గొన్నారు. విశాఖలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం విశాఖలో ఉండగానే తుపాకులతో తమ పార్టీ నేతను కాల్చి చంపారని అమర్నాథ్ చెప్పారు. విశాఖలోని కీలక ప్రాంతాంలో వెయ్యి కోట్ల భూమికి సంబంధించిన లావాదేవీల్లో నారా లోకేష్‌ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారని అమర్‌నాథ్ చెప్పారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. వారం రోజుల్లో వాటిని బయటపెట్టబోతున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మధ్య నడుస్తున్న ఈ వివాదంలో లోకేష్‌ పూర్తి స్థాయిలో కథ నడుపుతున్నారని అమర్‌నాథ్ చెప్పారు. విశాఖలో మీటింగ్‌లు పెడుతున్నా చంద్రబాబు, వెంకయ్యల అసలు చూపు మాత్రం అమరావతిపైనే ఉందని విమర్శించారు.

విశాఖలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం ప్రజలు మరిచిపోయి చాలా కాలమైందని కాంగ్రెస్ నేత ద్రోణంరాజు చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే విశాఖలో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందన్నారు. విశాఖ కోసం ఏ పని చేశారో మంత్రులు గంటా, అయన్నపాత్రుడు చెప్పాలన్నారు. జిల్లాలో నోరున్న ఎమ్మెల్యేలు మాఫియాగా మారారని, నోరు లేని ఎమ్మెల్యేలు మాఫియా చేతుల్లో కీలు బొమ్మలయ్యారని స్వయంగా బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్‌ రాజే చెప్పారని ద్రోణంరాజు గుర్తు చేశారు. విశాఖలో  అటవిక రాజ్యం నడుస్తోందని ఆవేదన చెందారు.

విశాఖలో మంత్రి గంటా శ్రీనివాస్ సొంత సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పనిలో ఉన్నారని వామపక్షనాయకుడు నర్సింగరావు ఆరోపించారు. నర్సీపట్నం బస్టాండ్ భూములను కూడా గంటా సొంతం చేసుకున్నారని చెప్పారు. కలెక్టరేట్ వెనుక ఉన్న గంధ్రాలయానికి చెందిన విలువైన భూమిని గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే గంటా 30ఏళ్ల లీజుతో కాజేశారని అయితే గవర్నర్‌ పాలనలో దాన్ని రద్దు చేశారని చెప్పారు. కానీ ఆ స్థలాన్ని ఇప్పటికీ ఖాళీ చేయకుండా గంటా వివాదాన్ని నడుపుతున్నారని దీని వల్ల జిల్లా గంథ్రాలయమే లేకుండా పోయిందని నర్సింగరావు చెప్పారు. జిల్లాలో లక్ష ఎకరాలను 30ఏళ్ల లీజు మీద కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. 30ఏళ్ల లీజుతో భూములు తీసుకోవడం అంటే వాటిని పూర్తిగా సొంతం చేసుకోవడమేనన్న విషయం అందరికీ తెలుసన్నారు.

చర్చకార్యక్రమానికి ఫోన్‌ చేసిన పలువురు నగర వాసులు కూడా విశాఖలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ప్రజల దశాబ్దాల కల అయిన రైల్వే జోన్‌ను విజయవాడ తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఒక్క మంత్రి కూడా మాట్లాడకపోవడం బట్టే టీడీపీ నేతల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఒక కాలర్ అన్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు మాత్రమే దోచుకుని బాగుపడుతున్నారని మరో కాలర్ ఆరోపించారు.

Click on Image to Read:

devineni-nehru-comments

chandrababu-naidu-central-government

unadvalli-arun-kumar