Telugu Global
Cinema & Entertainment

నట వారసురాళ్లకు అతడే హీరో....

ఒకప్పుడు తెలుగులో నటవారసులు మాత్రమే ఉండేవారు. హీరోగారి సుపుత్రుడే మళ్లీ హీరోగా ఎంట్రీ ఇచ్చేవాడు. ఇందులో తప్పులేదని సమర్థించుకునే బ్యాచే ఇండస్ట్రీలో ఎక్కువ. సో… ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ తనయులు కూడా పెద్దయ్యాక హీరోలే అవుతారు. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఈ విషయం అటుంచితే ఇప్పుడు నటవారసురాళ్లు కూడా బయల్దేరారు. హీరోల కుమార్తెలు కూడా హీరోయిన్లు అవుతున్న సందర్భాలున్నాయి. ఇలాంటి నటవారసురాళ్లకు నాగశౌర్య హీరోగా మారుతున్నాడు. ఒక […]

నట వారసురాళ్లకు అతడే హీరో....
X

ఒకప్పుడు తెలుగులో నటవారసులు మాత్రమే ఉండేవారు. హీరోగారి సుపుత్రుడే మళ్లీ హీరోగా ఎంట్రీ ఇచ్చేవాడు. ఇందులో తప్పులేదని సమర్థించుకునే బ్యాచే ఇండస్ట్రీలో ఎక్కువ. సో… ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ తనయులు కూడా పెద్దయ్యాక హీరోలే అవుతారు. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఈ విషయం అటుంచితే ఇప్పుడు నటవారసురాళ్లు కూడా బయల్దేరారు. హీరోల కుమార్తెలు కూడా హీరోయిన్లు అవుతున్న సందర్భాలున్నాయి. ఇలాంటి నటవారసురాళ్లకు నాగశౌర్య హీరోగా మారుతున్నాడు. ఒక మనసు సినిమాతో నాగబాబు కూతురు నిహారిక ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నిహారికకు జోడీగా నాగశౌర్య నటించాడు. ఇప్పుడు మరో హీరో కుమార్తె ఎంట్రీకి కూడా నాగశౌర్యే హీరోగా మారే అవకాశాలున్నాయి. రాజశేఖర్ కూతురు శివానీ… త్వరలోనే వెండితెర ఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిర్మాత సాయి కొర్రపాటికి చెందిన వారాహి చలనచిత్ర బ్యానర్ పై శివానీ ఎంట్రీ ఉంటుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా… శివానీ సరసన హీరోగా మరోసారి నాగశౌర్యనే తీసుకోవాలని అనుకుంటున్నారట. కొత్త హీరోయిన్లకు ఒకప్పుడు చంద్రమోహన్ కేరాఫ్ అడ్రస్. ఏ హీరోయిన్ ఎంట్రీ అయినా చంద్రమోహన్ సరసన జరగాల్సిందే. ఇప్పుడు నాగశౌర్య ఆ పొజిషన్ లో ఫిట్ అయినట్టు కనిపిస్తున్నాడు.

First Published:  20 Sep 2016 3:20 AM GMT
Next Story