Telugu Global
International

ఇండియాతో యుద్ధానికి సిద్ధం: పాక్‌

భార‌త్ తో ఎలాంటి పరిస్థితుల‌ను ఎదుర్కొనేందుకుకైనా తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ఆర్మీచీఫ్ రహీల్ షరీఫ్ ప్ర‌క‌టించారు. క‌శ్మీర్ స‌రిహ‌ద్దులోని యురి- భార‌త సైనిక శిబిరంపై పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాద సంస్థ‌ జైషే మ‌హ‌మ్మ‌ద్ సంస్థ దాడిలో 18 మంది జ‌వాన్లు చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో రెండుదేశాల మ‌ధ్య యుద్ధ‌మేఘాలు క‌మ్ముకున్నాయి. ఈ దాడిని ఎలా తిప్పికొట్టాలా? అంత‌ర్జాతీయ వేదిక‌పై పాక్ తీరును ఎలా ఎండ‌గ‌ట్టాలి? అంటూ దేశ ప్ర‌ధాని, రాష్ట్రప‌తి స‌మాచాలోచ‌న‌లు జ‌రుపుతుంటే పాక్ […]

ఇండియాతో యుద్ధానికి సిద్ధం: పాక్‌
X
భార‌త్ తో ఎలాంటి పరిస్థితుల‌ను ఎదుర్కొనేందుకుకైనా తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ఆర్మీచీఫ్ రహీల్ షరీఫ్ ప్ర‌క‌టించారు. క‌శ్మీర్ స‌రిహ‌ద్దులోని యురి- భార‌త సైనిక శిబిరంపై పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాద సంస్థ‌ జైషే మ‌హ‌మ్మ‌ద్ సంస్థ దాడిలో 18 మంది జ‌వాన్లు చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో రెండుదేశాల మ‌ధ్య యుద్ధ‌మేఘాలు క‌మ్ముకున్నాయి. ఈ దాడిని ఎలా తిప్పికొట్టాలా? అంత‌ర్జాతీయ వేదిక‌పై పాక్ తీరును ఎలా ఎండ‌గ‌ట్టాలి? అంటూ దేశ ప్ర‌ధాని, రాష్ట్రప‌తి స‌మాచాలోచ‌న‌లు జ‌రుపుతుంటే పాక్ మాత్రం వెకిలిమాట‌ల ద్వారా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. సోమ‌వారం ఓ స‌మావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ ర‌హీల్ ష‌రీఫ్ మాట్లాడారు. పొరుగు దేశంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నాం. మేం ఎలాంటి ప‌రిస్థితుల‌కైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. పాక్ ఆర్మీ చాలా బ‌లంగా ఉంది అన్నారు. అంటే పాక్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అంటూ ప‌రోక్షంగా క‌య్యానికి కాలు దువ్వారు. క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న హింస‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకే భార‌త్ త‌న‌పై తానే దాడి చేసుకుంద‌ని దిగ‌జారుడు ఆరోప‌ణ‌లు చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్య‌ల‌తో పాక్ భండారం బ‌య‌ట‌ప‌డింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. పాక్ దాడి చేయించింద‌న్న వార్త‌ల‌కే యుద్ధానికి దిగుతామ‌ని స‌న్న‌ద్ధ‌త వ్య‌క్తం చేయ‌డ‌మేంటి? గుమ్మ‌డి కాయ దొంగ‌ల చందంగా భుజాలు త‌డుముకోవాల్సిన అవ‌స‌రం పాకిస్తాన్‌కు ఎందుకు వ‌చ్చింది? అని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.
First Published:  20 Sep 2016 12:58 AM GMT
Next Story