Telugu Global
NEWS

సీఎం జిల్లాలో మహిళల ఎగుమతి

చిత్తూరు జిల్లాలో మహిళలను విదేశాలకు ఎగుమతి చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. భర్తతో విడిపోయిన మహిళలు, వితంతువులు, పెద్దగా బంధువులు లేనివాళ్లను, ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరవై రోజుల క్రితం చెన్నైలో తమిళనాడుకు చెందిన రఫీ, పాండియన్‌ లను తొలుత అరెస్టు చేశారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోమేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఏసుప్రేమ, చెన్నైకి చెందిన పాతిమాను అరెస్ట్ చేసి విచారించగా అనేక కీలక […]

సీఎం జిల్లాలో మహిళల ఎగుమతి
X

చిత్తూరు జిల్లాలో మహిళలను విదేశాలకు ఎగుమతి చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. భర్తతో విడిపోయిన మహిళలు, వితంతువులు, పెద్దగా బంధువులు లేనివాళ్లను, ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరవై రోజుల క్రితం చెన్నైలో తమిళనాడుకు చెందిన రఫీ, పాండియన్‌ లను తొలుత అరెస్టు చేశారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోమేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఏసుప్రేమ, చెన్నైకి చెందిన పాతిమాను అరెస్ట్ చేసి విచారించగా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చెన్నైకి చెందిన రఫి చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పలువురిని ఏజెంట్లగా నియమించుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళలను గుర్తించి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వలలో వేసుకున్నారు. ఇప్పటి వరకు 90 మంది మహిళలను మలేషియా, సింగపూర్‌, గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసినట్టు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. చాలామందిని వ్యభిచార గృహాలకు అమ్మేసినట్టు వెల్లడించారు. దీంతో వెళ్లిన వారంతా విదేశాల్లోనే ఉన్నారా?. వారి పరిస్థితి ఏంటి అన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మహిళల వివరాలను పాస్‌పోర్టు కార్యాలయాల్లో ఆరా తీస్తున్నారు.

First Published:  20 Sep 2016 1:10 AM GMT
Next Story