Telugu Global
Cinema & Entertainment

బిచ్చ‌గాడు చిత్ర హీరోయిన్ ను బ‌ల‌వంత పెట్టి పెళ్లిచేసుకోలేద‌ట‌..! 

తమిళ డబ్బింగ్ చిత్రం ‘బిచ్చగాడు’ సినిమా ద్వారా పాపులర్‌ అయిన హీరోయిన్‌ సాట్నా టైటస్‌. ఆమె రీసెంట్ గా లవ్ మ్యారేజ్ చేసుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం ఆమె తల్లికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం మాత్రమే కాదు..ఆమె వివాహం చేసుకున్న వ్యక్తి ఓ డిస్ట్ర్రిబ్యూటర్ కూడా కావటం. ఈ నేపధ్యంలో తన కూతురుని మాయ చేసి బుట్టలో పడేసి పెళ్లి చేసుకున్నాడంటూ నడిగర సంఘంలో ఆమె తల్లి కంప్లైంట్ చేసింది. ఈ విషయమై […]

బిచ్చ‌గాడు చిత్ర హీరోయిన్ ను బ‌ల‌వంత పెట్టి పెళ్లిచేసుకోలేద‌ట‌..! 
X
తమిళ డబ్బింగ్ చిత్రం ‘బిచ్చగాడు’ సినిమా ద్వారా పాపులర్‌ అయిన హీరోయిన్‌ సాట్నా టైటస్‌. ఆమె రీసెంట్ గా లవ్ మ్యారేజ్ చేసుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం ఆమె తల్లికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం మాత్రమే కాదు..ఆమె వివాహం చేసుకున్న వ్యక్తి ఓ డిస్ట్ర్రిబ్యూటర్ కూడా కావటం. ఈ నేపధ్యంలో తన కూతురుని మాయ చేసి బుట్టలో పడేసి పెళ్లి చేసుకున్నాడంటూ నడిగర సంఘంలో ఆమె తల్లి కంప్లైంట్ చేసింది. ఈ విషయమై సాట్నాను వివాహం చేసుకున్న కార్తీక్ మీడియాతో మాట్లాడాడు. కార్తీ మాట్లాడుతూ…తాను ఎప్పుడూ సాట్నా ను వివాహ విషయమై బలవతం చేయలేదన్నారు.
మేము కొంతకాలంగా ప్రేమించుకుని తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అయితే మా తల్లి, తండ్రులు ఈ వివాహానికి అభ్యంతరం చెప్పారు కాబట్టి మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. మేము మరికొద్ది రోజుల్లో అంటే వచ్చే సంవత్సరం ప్రారంభంలో గ్రాండ్ గా అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటాం అన్నారు. అయితే సాట్నా తల్లి ఓ తమిళ పత్రికతో మాట్లాడుతూ…కార్తీ తన కుమార్తెను వివాహం చేసుకోమంటూ బలవతం చేసాడని ఆరోపించింది. ఈ విషయమై కార్తీ విభేధించాడు. మేము ఒకరినొకరు ఇష్టపడే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆమెను బలవంతం చేసి పెళ్లిచేసుకోవాల్సిన అవసరం లేదు. మేము త్వరలోనే మా తల్లి,తండ్రులను ఒప్పించి, వారి ఆశీస్సులు తీసుకుంటాము. కార్తీ..కెరీ ఫిల్మ్ లో ఓ భాగస్వామి. కెఆర్ ఫిల్మ్స్ వారే తమిళనాడులో పిచ్చైకారన్ (బిచ్చగాడు)ని రిలీజ్ చేసారు.
First Published:  20 Sep 2016 1:00 AM GMT
Next Story