Telugu Global
NEWS

ఫిరాయింపులపై ఇక వైసీపీ వంతు!

తెలంగాణ‌లో ఫిరాయింపుల‌పై వైసీపీ కాస్త ఆల‌స్యంగానైనా స‌రే స్పందించింది. ఈ విష‌యంలో ఇప్ప‌టికే కాంగ్రెస్‌, టీడీపీలు సుప్రీం కోర్టు దాకా వెళ్లి న్యాయ‌పోరాటం చేస్తున్నాయి. మొత్తానికి ఇత‌ర ప్ర‌తిప‌క్షాల‌కు తోడుగా వైసీపీ కూడా జ‌త‌క‌లిసింది. తాజాగా త‌మ పార్టీ నుంచి అధికార పార్టీలోకి మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుకు వెంటనే నోటీసులిచ్చి, అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ‌లో వైఎస్సార్ […]

ఫిరాయింపులపై ఇక వైసీపీ వంతు!
X
తెలంగాణ‌లో ఫిరాయింపుల‌పై వైసీపీ కాస్త ఆల‌స్యంగానైనా స‌రే స్పందించింది. ఈ విష‌యంలో ఇప్ప‌టికే కాంగ్రెస్‌, టీడీపీలు సుప్రీం కోర్టు దాకా వెళ్లి న్యాయ‌పోరాటం చేస్తున్నాయి. మొత్తానికి ఇత‌ర ప్ర‌తిప‌క్షాల‌కు తోడుగా వైసీపీ కూడా జ‌త‌క‌లిసింది. తాజాగా త‌మ పార్టీ నుంచి అధికార పార్టీలోకి మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుకు వెంటనే నోటీసులిచ్చి, అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ‌లో వైఎస్సార్ సీపీకి మొత్తం 3 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానం ద‌క్కాయి. ఈ మూడు కూడా ఖ‌మ్మం జిల్లాలోనే కావ‌డం గ‌మ‌నార్హం. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం తెలంగాణ‌లో తెలంగాణ రాష్ట్రస‌మితి – వైఎస్సార్ కాంగ్రెస్ మిత్రులుగానే మెదిలాయి. వివిధ అంశాల‌పై వైసీపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు కూడా ఇచ్చింది. ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు కోరే విష‌యంలో కేసీఆర్ – జ‌గ‌న్ మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌ల‌ను జ‌గ‌న్ అంగీక‌రించ‌డంతో అసెంబ్లీలో వైసీపీ అధికార టీఆర్ ఎస్‌కు మ‌ద్దతుగా నిలిచింది.
కానీ, ఓటుకు నోటు కేసు కుట్ర బ‌య‌ట‌ప‌డ‌టం రాజ‌కీయాల్లో సంచ‌ల‌న మార్పులు చోటు చేసుకున్నాయి. త‌క్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే..ఎప్ప‌టికైనా త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ – కాంగ్రెస్ కుట్ర ప‌న్నే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కేసీఆర్ ఆందోళ‌న చెందాడు. పైగా ఓటుకు నోటు కుట్ర బ‌య‌ట‌ప‌డక‌ముందే టీడీపీ ప‌లువురు అధికార ఎమ్మెల్యేల‌ను డ‌బ్బులిచ్చి ప్ర‌లోభ‌పెట్టే ప్ర‌య‌త్నం చేసింద‌ని నిఘా వ‌ర్గాలు సీఎంను అప్ర‌మ‌త్తం చేశాయి. దీంతో అసెంబ్లీలో త‌న బ‌లం పెంచుకునేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను ప్రారంభించాడు కేసీఆర్‌. తెలుగుదేశం, వైసీపీ కాంగ్రెస్ నుంచి ఇలా ఏ పార్టీలో అవ‌కాశం దొరికినా వ‌దులుకోలేదు. వీలైనంత ఎక్కువ‌మందిని గోడ దూకేలా చేశారు.
దీనిపై టీడీపీ నేత‌లు రేవంత్ రెడ్డి, ఎర్ర‌బెల్లి సుప్రీంను ఆశ్ర‌యించారు. అధికార పార్టీలో చేరిన ఎర్ర‌బెల్లి ఇటీవ‌ల‌ ఈ కేసు నుంచి త‌ప్పుకున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ కూడా ఈ విష‌యంపై సుప్రీంలో కేసు వేశారు. ఈ కేసు విచార‌ణ‌లో ఉంది. తాజాగా వైసీపీ కూడా వీరికి జ‌త‌క‌లిసి న్యాయ‌పోరాటంలో పాలు పంచుకుంటుందా? లేక విన‌తిప‌త్రాల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే!
First Published:  20 Sep 2016 9:00 PM GMT
Next Story