Telugu Global
NEWS

జైల్లో ఉన్న రోజుల‌ను గుర్తు చేసుకున్న సుమ‌న్‌!

 ద‌క్షిణాదిన అగ్ర‌హీరోగా వెలుగొందుతున్న స‌మ‌యంలో సినీన‌టుడు సుమ‌న్ జైలు జీవితం గ‌డ‌పాల్సి వ‌చ్చింది. అయినా కుంగిపోకుండా ఆ కేసును ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆత్మ‌విశ్వాసం ఉంటే ఎలాంటి విప‌త్తునైనా ఎదుర్కోవ‌చ్చంటున్నారు సుమ‌న్‌. చ‌ర్ల‌ప‌ల్లి జైలులో సినీన‌టుడు సుమ‌న్ ఖైదీల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఖైదీల్లో మార్పు తీసుకువ‌చ్చేందుకు చేప‌ట్టిన మ‌హాప‌రివ‌ర్త‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా జైలు అధికారులు సుమ‌న్ ను ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో సుమ‌న్ మాట్లాడుతూ.. తాను కూడా ఒక‌ప్పుడు జైలు శిక్ష అనుభ‌వించాన‌న్నారు. జైలు జీవితం ఎవ‌రికీ ఇష్ట‌ముండ‌ద‌ని, అయితే […]

జైల్లో ఉన్న రోజుల‌ను గుర్తు చేసుకున్న సుమ‌న్‌!
X
ద‌క్షిణాదిన అగ్ర‌హీరోగా వెలుగొందుతున్న స‌మ‌యంలో సినీన‌టుడు సుమ‌న్ జైలు జీవితం గ‌డ‌పాల్సి వ‌చ్చింది. అయినా కుంగిపోకుండా ఆ కేసును ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆత్మ‌విశ్వాసం ఉంటే ఎలాంటి విప‌త్తునైనా ఎదుర్కోవ‌చ్చంటున్నారు సుమ‌న్‌. చ‌ర్ల‌ప‌ల్లి జైలులో సినీన‌టుడు సుమ‌న్ ఖైదీల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఖైదీల్లో మార్పు తీసుకువ‌చ్చేందుకు చేప‌ట్టిన మ‌హాప‌రివ‌ర్త‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా జైలు అధికారులు సుమ‌న్ ను ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో సుమ‌న్ మాట్లాడుతూ.. తాను కూడా ఒక‌ప్పుడు జైలు శిక్ష అనుభ‌వించాన‌న్నారు. జైలు జీవితం ఎవ‌రికీ ఇష్ట‌ముండ‌ద‌ని, అయితే మ‌నిషికి ఎలాంటి క‌ష్టాలు ఎదురైనా ఆత్మ‌స్థైర్యం కోల్పోకూడ‌ద‌న్నారు. త‌న‌పై నేరారోప‌ణ‌లు వ‌చ్చినా.. ఏనాడూ కుంగిపోలేద‌ని వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాన‌న్నారు. కాబ‌ట్టే.. సీనీరంగంలో తాను ఈ స్థాయికి చేరుకున్నాన‌ని వివ‌రించారు. జైలు జీవితంలో అడుగుపెట్టినంత మాత్రాన జీవితం ముగిసిన‌ట్లు కాద‌న్నారు. ఏనాడూ ఓట‌మికి త‌ల‌వంచ‌వ‌ద్ద‌న్నారు. తెలిసో.. తెలియ‌కో.. క్ష‌ణికావేశంలో కొంద‌రు నేరాలకు పాల్ప‌డుతున్నారు. ఇక్క‌డికి వ‌చ్చాక మంచివారిగా మారాల్సిన అవ‌స‌రముంద‌ని, అప్పుడే న‌లుగురిలో మీకు గౌర‌వం ద‌క్కుతుంద‌న్నారు. ఇంకా త‌న‌కు జైలు జీవితంలో ఎదురైన క‌ష్టాల‌ను, వాటిని అధిగ‌మించిన తీరును సుమ‌న్ వివ‌రించి ఖైదీల్లో స్ఫూర్తినింపే ప్ర‌య‌త్నం చేశారు.
First Published:  20 Sep 2016 10:08 PM GMT
Next Story