Telugu Global
NEWS

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇబ్బందే... స్పీకర్‌కు గడువు విధించిన హైకోర్టు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన వారిపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. 12 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను 3 నెలల్లో తేల్చాలని గడువు విధించింది. టీటీడీపీని టీఆర్ఎస్‌లోకి స్పీకర్‌ విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పరోక్షంగా టీడీపీని స్పీకర్ టీఆర్ఎస్ లో విలీనం చేయడాన్ని తప్పుపట్టింది. ఎమ్మెల్యేలపై తాము ఇచ్చిన […]

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇబ్బందే... స్పీకర్‌కు గడువు విధించిన హైకోర్టు
X

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన వారిపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. 12 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను 3 నెలల్లో తేల్చాలని గడువు విధించింది. టీటీడీపీని టీఆర్ఎస్‌లోకి స్పీకర్‌ విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పరోక్షంగా టీడీపీని స్పీకర్ టీఆర్ఎస్ లో విలీనం చేయడాన్ని తప్పుపట్టింది. ఎమ్మెల్యేలపై తాము ఇచ్చిన అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే పార్టీ విలీనం ఎలా సాధ్యమని టీడీపీ తరపు న్యాయవాది వాదించారు. స్పీకర్‌ కార్యాలయం వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ముందుగా 12 మంది అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

నిజానికి తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఫిరాయించారు. వారు తప్పు చేశారన్న సంగతి సాధారణ జనానికి కూడా అర్థమైంది. నిజాయితీగా అయితే వారిపై ఇప్పటికే అనర్హత వేటు పడాల్సింది. కానీ అది జరగలేదు. హైకోర్టు తీర్పు తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో!. హైకోర్టు తీర్పు తెలంగాణకు సంబంధించినదే అయినా అటు ఏపీలోనూ విచ్చలవిడిగా ఫిరాయింపులు సాగుతున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ స్పీకర్ కూడా నిజాయితీగా స్పందిస్తారో లేదంటే తీర్పు తెలంగాణ స్పీకర్ కు సంబంధించినది కాబట్టి తాము స్పందించాల్సిన అవసరం లేదంటారో చూడాలి.

Click on Image to Read:

ys-jagan

lokesh

gorantla-butchaih-chowdary

First Published:  21 Sep 2016 12:20 AM GMT
Next Story