ఈసారి నాని పరిస్థితేంటి…?

వరుసగా 3 హిట్స్ కొడితే ఏ హీరోపైనైనా అంచనాలు పెరుగుతాయి. ప్రస్తుతం నాని పరిస్థితి ఇదే. హ్యాట్రిక్ కొట్టిన ఈ హీరో, తాజాగా మజ్నుతో మరోసారి రెడీ అయ్యాడు. ఇంకొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్నాడు. మరి వరుసగా సక్సెస్ లు కొడుతున్న నాని, మజ్నూతో తన రికార్డుని కొనసాగిస్తాడా అనేది పెద్ద డౌట్. సినిమాలో స్టఫ్ ఎంత ఉంటుందనే విషయాన్ని పక్కనపెట్టి… మజ్ను వరుసగా నాలుగో హిట్ కొడతాడా అనే బెట్టింగ్ లు ఊపందుకున్నాయి.
జెంటిల్మెన్ చిత్రం తరువాత హీరో నాని నటించిన చిత్రం ఇది. ఉయ్యాలా జంపాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ… మజ్నుకు దర్శకత్వం వహించాడు. సినిమా ప్రారంభం నుంచే మూవీపై అంచనాలు పెరగడానికి ఇది కూడా ఓ కారణం. దశలవారీగా విడుదలైన ట్రైలర్లు, పాటలు ఆ అంచనాల్ని మరింతగా పెంచాయి. దీనికి తోడు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ఏకంగా 60లక్షల రూపాయలకు అమ్ముడుపోవడం కూడా సినిమాలో ఏదో ఉందనే ప్రచారాన్ని ఎక్కువచేసింది. సో… చూస్తుంటే నాని వరుసగా నాలుగో హిట్ కూడా కొట్టేట్టు కనిపిస్తున్నాడు.